Share News

1న మాజీ సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్యేగా ప్రమాణం

ABN , Publish Date - Jan 28 , 2024 | 03:30 AM

మాజీ సీఎం కేసీఆర్‌ ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేసీఆర్‌ ఈసారి గజ్వేల్‌, కామారెడ్డిల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయగా..

1న మాజీ సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్యేగా ప్రమాణం

హైదరాబాద్‌, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం కేసీఆర్‌ ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేసీఆర్‌ ఈసారి గజ్వేల్‌, కామారెడ్డిల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయగా.. కామారెడ్డిలో ఓడిపోయి, గజ్వేల్‌లో గెలిచారు. ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. డిసెంబరు 9న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో చాలామంది నూతన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజు మిగిలిపోయినవారు 12న అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రెండు సందర్భాల్లో కేసీఆర్‌ ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. తన ఫామ్‌హౌ్‌సలో కింద పడడంతో తుంటి ఎముక విరిగి ఆస్పత్రిపాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1న ఆయన అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారని బీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి.

Updated Date - Jan 28 , 2024 | 11:13 AM