Share News

కమ్మ సామాజికవర్గ అభివృద్ధికి కేజీఎఫ్‌ ఏర్పాటు

ABN , Publish Date - Mar 07 , 2024 | 04:19 AM

ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మ సామాజికవర్గం అభివృద్ధే లక్ష్యంగా కమ్మ గ్లోబల్‌ ఫెడరేషన్‌(కేజీఎ్‌ఫ)ను ఏర్పాటు చేసినట్లు కేజీఎఫ్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు జెట్టి కుసుమకుమార్‌ వెల్లడించారు.

కమ్మ సామాజికవర్గ అభివృద్ధికి కేజీఎఫ్‌ ఏర్పాటు

జూలై 20, 21 తేదీల్లో ఇంటర్నేషనల్‌ సమ్మిట్‌

వ్యవస్థాపక అధ్యక్షుడు జెట్టి కుసుమకుమార్‌

హైదరాబాద్‌, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మ సామాజికవర్గం అభివృద్ధే లక్ష్యంగా కమ్మ గ్లోబల్‌ ఫెడరేషన్‌(కేజీఎ్‌ఫ)ను ఏర్పాటు చేసినట్లు కేజీఎఫ్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు జెట్టి కుసుమకుమార్‌ వెల్లడించారు. హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీలో బుధవారం కేజీఎఫ్‌ ఆవిర్భావం జరిగింది. ఈ సందర్భంగా బ్రోచర్‌ను విడుదల చేశారు. ఈ ఏడాది జూలై 20, 21 తేదీల్లో హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో కేజీఎఫ్‌ ఇంటర్నేషనల్‌ సమ్మిట్‌ను నిర్వహించనున్నట్లు కుసుమకుమార్‌ తెలిపారు. ఈ సమావేశంలో తానా అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్‌, తాజామాజీ అధ్యక్షులైన సతీష్‌ వేమన, లావు అంజయ్య చౌదరితో పాటు యూకేకు చెందిన గుంటుపల్లి జయకుమార్‌, కర్నాటక కమ్మ సంఘం అధ్యక్షుడు గారపాటి రామకృష్ణ, కేజీఎఫ్‌ గల్ఫ్‌ కౌన్సిల్‌ కోఆర్డినేటర్‌ జె. గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెట్టి మాట్లాడుతూ.. కమ్మ కమ్యూనిటీ ఆర్గనైజేషన్‌లోని సభ్యులందర్నీ ఒకే తాటిపైకి తీసుకురావాల్సిన అవసరాన్ని వివరించారు. కమ్మ సామాజికవర్గం అభివృద్ధి చెందడమే కాకుండా సమాజ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు. మన దేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మ సామాజికవర్గానికి సేవ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర మొత్తం జనాభాలో కమ్మ సామాజికవర్గం 6 శాతం(22 లక్షలు) ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో 7 శాతం(36.5 లక్షలు), తమిళనాడులో 7.7 శాతం(65 లక్షలు), కర్నాటకలో 6 శాతం(40 లక్షలు) ఉన్నట్లు వెల్లడించారు.

Updated Date - Mar 07 , 2024 | 09:11 AM