Share News

Kumaram Bheem Asifabad- మహిళలకు అండ

ABN , Publish Date - Sep 10 , 2024 | 10:59 PM

మహిళా సాధికారతలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలిచేందుకు మహిళాశక్తి పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా జిల్లాలో 23 రకాల యూనిట్ల ఏర్పాటుకు అధికారులు ప్రణాళికలు రూ పొందించారు. త్వరలో ప్రారంభించేదుకు చర్యలు తీసుకుంటున్నారు.

Kumaram Bheem Asifabad-   మహిళలకు అండ
కలెక్టరేట్‌లో ప్రారంభం కానున్న క్యాంటీన్‌

- ఆసక్తి ఉన్న యూనిట్ల ఏర్పాటుకు ప్రణాళికలు

- ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారుల చర్యలు

- జిల్లాలో 9,178 మందికి లబ్ధి

మహిళా సాధికారతలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలిచేందుకు మహిళాశక్తి పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా జిల్లాలో 23 రకాల యూనిట్ల ఏర్పాటుకు అధికారులు ప్రణాళికలు రూ పొందించారు. త్వరలో ప్రారంభించేదుకు చర్యలు తీసుకుంటున్నారు.

ఆసిఫాబాద్‌రూరల్‌, సెప్టెంబరు 10: మహిళలను ఆర్థికంగా బలోపే తం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన మహిళాశక్తి పథకంతో జిల్లాలో వేలాది మందికి శాశ్వత జీవనోపాధి లబించనుంది. సుమారు 23 రంగాల్లో యూనిట్ల ఏర్పాటుకు జిల్లా గ్రామీణాభివృద్దిశాఖ అధికా రులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. జిల్లాలోని 345 గ్రామ పంచాయ తీల్లోని 8,100 గ్రామ సంఘాలకు మహిళాశక్తి పథకం వర్తింపచేసి రూ. 98.78 కోట్లతో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పక్కా ప్రణాళికలు రుపొందించారు. దీంతో సుమారు 9,178 మంది మహిళలకు లబ్ధి చేకూ రనుంది. ఇప్పటికి 23 రకాల యూనిట్లలో గ్రామ సంఘాల్లోని మహిళల ఆసక్తి మేరకు యూనిట్లు నెలకొల్పుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 233 యూనిట్లు ప్రారంభించారు. త్వరలో కలెక్టరేట్‌లో క్యాంటీన్‌ను ప్రారంభించనున్నారు.

- 398 గ్రామ సంఘాలు..

జిల్లాలో 398 గ్రామ సంఘాలు, 8,100 స్వయం సహయక సంఘాల్లో 90,112 మంది సభ్యులున్నారు. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. బ్యాంకు లింకేజీ కింద 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 898 స్వయం సంఘాలకు రూ. 52.73 కోట్ల రుణ సదుపాయం కల్పించింది. ఇప్పటికే జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే జిల్లా గ్రామీణాభివృధ్ది శాఖ అధికారులతో కలిసి మహిళాశక్తి పథకం యూనిట్ల నిర్వహణపై సమీక్ష నిర్వహిం చారు. జిల్లాలో 33.83 శాతం మహిళా సంఘాలను ఈ పథకం కింద ఆర్హులుగా గుర్తించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మహిళాశక్తి పథకంలో భాగంగా జిల్లాకు కేటాయించిన యూనిట్లను త్వరగా ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

- 23 రకాల యూనిట్లు..

మహిళాశక్తి పథకం కింద 23 రకాల యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో క్యాంటీన్లు, చేపల పెంపకం, పాఢి పశువులు, పాడి ఉత్పత్తుల విక్రయ కేంద్రాలు, ఆధార్‌, మీసేవా కేంద్రాలు, దేశీవాళీ కోళ్ల పెంపకం, పౌలీ్ట్రఫాం, ఎంటర్‌ప్రైజేస్‌ యూనిట్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయా యూనిట్లను నిర్వహించేందుకు గాను మహిళలకు బ్యాంకు లు, స్త్రీనిధి, మండల మహిళా సమాఖ్య ద్వారా వడ్డీలేని రుణాలు అందిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఆర్హత గల లబ్ధిదారులను గుర్తించి క్షేత్ర స్థాయిలో యూనిట్లు ప్రారంభిం చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. త్వరలో జిల్లా ఇన్‌చార్జీ మంత్రి సీతక్క చేతుల మీదుగా మహిళాశక్తి యూనిట్లను ప్రారంభించేం దుకు జిల్లా గ్రామీణాభి వృద్ధిశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే సూచన మేరకు నాలుగు చోట్ల మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టరేట్‌ సముదాయంలో, జిల్లా ఆసుపత్రి, కౌటాలలోని బస్టాండు ఏరియాలో, కుమరంభీం ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసే విధంగా కార్యాచరణ రూపొం దించారు.

నాలుగు క్యాంటీన్ల ఏర్పాటుకు చర్యలు..

- దత్తరాం, డీఆర్డీవో

జిల్లా వ్యాప్తంగా నాలుగు క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. ఇందులో కొన్ని మోబైల్‌ క్యాంటీన్లు ఏర్పాటు చేయాల్సి వస్తుంది. ఆసక్తి చూపించే మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించి ప్రొత్సహిస్తున్నాం. బ్యాంకు రుణాలు ఇప్పించి క్యాంటీన్లు ఏర్పా టు చేయిస్తాం. కలెక్టరేట్‌లోని క్యాంటీ న్‌ను త్వరలోనే ప్రారంభిస్తాం.

ఆర్థికాభివృద్ధికి అవకాశం

- మార స్వరూప, మండల సమైఖ్య అధ్యక్షురాలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళాశక్తి పథకంతో మహిళలు ఆర్థికంగా అభి వృద్ధి సాధించేందుకు అవకాశంగా భావిస్తున్నాం. ఆసక్తి గల సభ్యులందరిని ఈ పథకంలో భాగస్వామ్యం చేసేందుకు ప్రయత్ని స్తున్నాం. ఇప్పటికే మండలాల వారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం.

Updated Date - Sep 10 , 2024 | 10:59 PM