Share News

కోట్‌పల్లి ప్రాజెక్టు ఆధునికీకరణకు రూ. 140 కోట్లు

ABN , Publish Date - Feb 20 , 2024 | 11:58 PM

కోట్‌పల్లి ప్రాజెక్టు ఆధునికీకరణకు రూ. 140 కోట్లు మంజూరు కానున్నాయని శాసనసభ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ తెలిపారు.

కోట్‌పల్లి ప్రాజెక్టు ఆధునికీకరణకు రూ. 140 కోట్లు
మాట్లాడుతున్న శాసనసభ స్పీకర్‌ జి.ప్రసాద్‌కుమార్‌.

శాసనసభ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌

ధారూరు, ఫిబ్రవరి 20: కోట్‌పల్లి ప్రాజెక్టు ఆధునికీకరణకు రూ. 140 కోట్లు మంజూరు కానున్నాయని శాసనసభ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ తెలిపారు. వికారాబాద్‌కు చెందిన దాత బస్వలింగం బసవేశ్వర విగ్రహం ఏర్పాటు చేయగా, మహ్మదాబాద్‌కు చెందిన సీ.అశోక్‌కుమార్‌ వీరభద్రేశ్వర మహాద్వారాలను నిర్మించారు. వీటిని మంగళవారం సీఈ్పకర్‌ ప్రారంభించి మాట్లాడారు. రెండు మండలాల పరిధిలోని పదివేల ఎకరాల ఆయకట్టుకు నీరందించే కోట్‌పల్లి ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం 6వేల ఎకరాలకు నీరందుతున్నారు. చెప్పారు. పూర్తి ఆయకట్టుకు నీరందించేందుకు ప్రాజెక్టును ఆధునికీకరించేందుకు అంచనాలు తయారుచేసి ప్రభుత్వానికి పంపించామన్నారు. త్వరలో నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. నాగసమందర్‌లో కోట్‌పల్లి ప్రాజెక్టు అలుగుపై బ్రిడ్జి నిర్మిస్తామని, దోర్నాల అసంపూర్తి వంతెనను పూర్తి చేయిస్తానని, ధారూరుకు జూనియర్‌ కళాశాల మంజూరు చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండునెలల్లో వికారాబాద్‌ నియోజకవర్గంలో అభివృద్ది పనులకు రూ.500 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. అంటరానితనాన్ని రూపుమాపేందుకు 12వ శతాబ్ధంలోనే బసవేశ్వరుడు కృషిచేశారని ఆయన గుర్తు చేశారు. మహానీయుల విగ్రహాలు పెట్టి వాళ్ల గురించి మాట్లాడటం కాకుండ వారిని ఆదర్శంగా తీసుకుని అనుసరించి చూపాలని ఆయన కోరారు. అనంతరం ఎంపీలు రంజిత్‌రెడ్డి, బి.బి.పాటిల్‌, మాజీ ఎమ్మెల్యే ఆనంద్‌ తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆలంపల్లి కెంపిమఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ డాక్టర్‌ చెన్నబసవ ప్రభుస్వాములు, బీసీ కమీషన్‌ సభ్యుడు శుభప్రద్‌ పటేల్‌, యువజన కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి సంతో్‌షకుమార్‌, వీరశైవ సమాజ నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2024 | 11:58 PM