అమ్మా నాన్నలకు పాదపూజ
ABN , Publish Date - Jan 29 , 2024 | 11:10 PM
షాబాద్ మండల కేంద్రంలో సోమవారం సంత్ శ్రీ ఆశారామ్ జీ ఆశ్రమం ఆధ్వర్యంలో శ్రీచైతన్య హైస్కూల్, కస్తూర్భా, శిశుమందిర్ పాఠశాలల్లోని విద్యార్థులు వారి తల్లిదండ్రులకు పాదపూజ నిర్వహించారు.
షాబాద్, జనవరి 29 : షాబాద్ మండల కేంద్రంలో సోమవారం సంత్ శ్రీ ఆశారామ్ జీ ఆశ్రమం ఆధ్వర్యంలో శ్రీచైతన్య హైస్కూల్, కస్తూర్భా, శిశుమందిర్ పాఠశాలల్లోని విద్యార్థులు వారి తల్లిదండ్రులకు పాదపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల ఉపాధ్యాయులు తల్లిదండ్రులు చేస్తున్న త్యాగాలను పిల్లలకు వివరించారు. ఫిబ్రవరి 14న వాలెంటైన్ డే బదులుగా మనం అమ్మానాన్న పూజా దినోత్సవం జరుపుకోవాలని ఆశ్రమం నిర్వాహకులు సూచించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు డాక్టర్ అమర్నాథ్, రాజేందర్, పరమేశ్వర్, శరత్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.