Share News

లోకల్‌ బాడీ ఎన్నికలపై దృష్టి సారించాలి

ABN , Publish Date - Jul 05 , 2024 | 11:04 PM

ఇటీవల జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను దృష్టిలో ఉంచుకొని వచ్చే లోకల్‌ బాడీ ఎన్నికలపై దృష్టి సారించాలని భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ సూచించారు.

 లోకల్‌ బాడీ ఎన్నికలపై దృష్టి సారించాలి
ఎన్నికల ఫలితాలపై సమీక్షిస్తున్న ఎంపీ డీకే అరుణ

- మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ

- పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గం వారీగా సమీక్ష

మహబూబ్‌ నగర్‌ (క్లాక్‌ టవర్‌ ), జూలై 5: ఇటీవల జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను దృష్టిలో ఉంచుకొని వచ్చే లోకల్‌ బాడీ ఎన్నికలపై దృష్టి సారించాలని భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ సూచించారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఇటీవల జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ముఖ్య నాయకులతో సమీక్షించారు. ఎన్నికల్లో జరిగిన లోటుపాట్లు, అనుకూలతలపై కీలకంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని, అందుకు వైశ్యమ్యాలు పక్కన పెట్టి కార్యకర్తలు అందరు కలిసి పని చేయాలని అన్నారు. సమావేశంలో పార్లమెంట్‌ ప్రభారికి వీఎల్‌ఎన్‌ రెడ్డి, బీజేపీ సీనియర్‌ నాయకుడు నాగురావు నామోజీ, మహబూబ్‌ నగర్‌ జిల్లా అధ్యక్షుడు పి. శ్రీనివాస్‌ రెడ్డి, నారాయణ పేట జిల్లా అద్యక్షుడు పగడాకుల శ్రీనివాసులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. కొండయ్య, శ్రీవర్ధన్‌రెడ్డి, అంఽధ్య బాబయ్య, విష్ణువర్ధన్‌ రెడ్డి, నాయకులు రతంగ్‌పాండు రెడ్డి, పడాకుల బాలరాజు, కుర్వ రాములు, ఎగ్గని నర్సిములు, కె. రవీందర్‌ రెడ్డి, పార్లమెంట్‌ విస్థారక్‌ కేతూరి బుడ్డన్న, పార్లమెంట్‌ కో-కన్వీనర్‌ కె. శ్రీనివాసులు, నర్సింహులు గౌడ్‌, వివిధ అసెంబ్లీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో మొక్కలు నాటారు. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు.

వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న డీకే అరుణ

వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాలమూరు ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఎంపీ డీకే అరుణమ్మ అకాక్షించారు. శుక్రవారం ఆమె కాటన్‌ మిల్‌ వేంటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు స్వాగతం పలికారు. ఎంపీ ప్రత్యేక పూలు చేశారు. అనంతరం డీకే అరుణను సన్మానించారు. ఆమె వెంట నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Updated Date - Jul 05 , 2024 | 11:04 PM