ఆరోపణలపై దృష్టి సారించాలి
ABN , Publish Date - Oct 20 , 2024 | 11:23 PM
జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో పని చేస్తున్న సిబ్బం దిపై వస్తున్న ఆరోపణలపై దృష్టి సారించి బా ధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాదిగ ఉద్యోగుల సమాఖ్య, ధర్మ టీచర్స్ యూనియన్, స్టేట్ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా విద్యాధికారి గోవిందరాజులుకు వినతిప త్రం అందజేశారు.
- ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో డీఈవోకు వినతి
నాగర్‌కర్నూల్ టౌన్, అక్టోబరు 20 : జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో పని చేస్తున్న సిబ్బం దిపై వస్తున్న ఆరోపణలపై దృష్టి సారించి బా ధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాదిగ ఉద్యోగుల సమాఖ్య, ధర్మ టీచర్స్ యూనియన్, స్టేట్ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా విద్యాధికారి గోవిందరాజులుకు వినతిప త్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డిప్యుటేషన్‌పై పని చేస్తున్న సిబ్బంది, డీఎస్సీ 2024 నియామకాలపై సోషల్ మీడియాలో తర చుగా ఆరోపణలు వస్తున్నాయని పేర్కొన్నారు. కొంత మంది విద్యాశాఖపై బుదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, దీనికి నివారించేందుకు తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని డీఈవోను కోరారు. కార్యక్రమంలో మాదిగ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర కోఆర్డినేటర్ వంకేశ్వరం నిరంజన్, ధర్మ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు గుడిపల్లి నిరం జన్, ప్రధాన కార్యదర్శి కూరాకుల ఆంజనేయు లు, రాష్ట్ర కార్యదర్శి కొంగరి జానయ్య, కోశాధికారి నల్లవాల అర్జున్, ఎస్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వర్, దళిత నాయకుడు వడ్డెమాన్ విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు.