Share News

పుష్ప సోయగం!

ABN , Publish Date - Aug 24 , 2024 | 11:12 PM

పచ్చని బంతి.. అలరిస్తున్న చామంతి, ఎర్రని గులాబీలు. ఇలా అనేక రకాల పుష్ప సోయగాలు కనువిందు చేస్తున్నాయి. రోడ్డు పక్కన పొలాల్లో సాగు చేసిన పూలతోటలు ఎంతో ఆహ్లాదాన్ని.. ఆనందాన్ని కలిగిస్తున్నాయి.

పుష్ప సోయగం!

పచ్చని బంతి.. అలరిస్తున్న చామంతి, ఎర్రని గులాబీలు. ఇలా అనేక రకాల పుష్ప సోయగాలు కనువిందు చేస్తున్నాయి. రోడ్డు పక్కన పొలాల్లో సాగు చేసిన పూలతోటలు ఎంతో ఆహ్లాదాన్ని.. ఆనందాన్ని కలిగిస్తున్నాయి. పచ్చని ఆకులపై పురి విప్పిన నెమలిలా ఆ పూబంతులు నాట్యం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. మొయినాబాద్‌ మండలం అమ్డాపూర్‌, కాశీంబౌలి గ్రామాల్లో ఈ సుందర మనోహర రూపం ఆ ప్రాంతాల నుంచి వెళుతున్న వారిని మంత్ర ముగ్ధులను చేస్తోంది. ఈ దారిన వెళుతున్న అనేకమంది తమ వాహనాలను ఆపుకొని ఈ సుందర దృశ్యాన్ని తమ సెల్‌ఫోన్లలో బంధించుకోవడంతో పాటు సెల్ఫీలు, ఫొటోలు దిగి అనుభూతి పొందుతున్నారు.

- ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌, రంగారెడ్డి జిల్లా

Updated Date - Aug 24 , 2024 | 11:12 PM