Share News

అనాథ పిల్లలకు ఆర్థిక సాయం

ABN , Publish Date - Feb 13 , 2024 | 11:26 PM

అనాథ పిల్లల అవసరాలు, ఆహార ఖర్చుల నిమిత్తం మహబూబ్‌నగర్‌ జడ్పీటీసీ పుల్లురు వెంకటేశ్వరమ్మరవీందర్‌రెడ్డి దంపతులు రూ.లక్ష చెక్కును కలెక్టర్‌ రవినాయక్‌కు అందజేశారు.

అనాథ పిల్లలకు ఆర్థిక సాయం
కలెక్టర్‌ రవినాయక్‌కు చెక్కును అందిస్తున జడ్పీ చైర్‌పర్సన్‌, జడ్పీటీసీ దంపతులు

- జడ్పీటీసీ దంపతులను సన్మానించిన కలెక్టర్‌ జి. రవి నాయక్‌

పాలమూరు యూనివర్సిటీ, ఫిబ్రవరి 13 : అనాథ పిల్లల అవసరాలు, ఆహార ఖర్చుల నిమిత్తం మహబూబ్‌నగర్‌ జడ్పీటీసీ పుల్లురు వెంకటేశ్వరమ్మరవీందర్‌రెడ్డి దంపతులు రూ.లక్ష చెక్కును కలెక్టర్‌ రవినాయక్‌కు అందజేశారు. మంగళవారం కలెక్టరేట్‌కు వెళ్లి కలెక్టర్‌ చాంబర్‌లో జడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ధాసుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ చేతుల మీదుగా రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ నటరాజ్‌, మాజీ చైర్మన్‌ అనంతరెడ్డిలకు అందజేశారు. అనాథ పిల్లలకు రూ.లక్ష సాయం చేసినందుకుగాను కలెక్టర్‌ సంతోషం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. జడ్పీటీసీ దంతులను కలెక్టర్‌ సన్మానించారు.

Updated Date - Feb 13 , 2024 | 11:26 PM