Share News

జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టులను భర్తీచేయండి

ABN , Publish Date - Mar 01 , 2024 | 03:45 AM

విద్యుత్‌ పంపిణీ సంస్థ టీఎ్‌సఎ్‌సపీడీసీఎల్‌లో భర్తీ కాకుండా మిగిలిపోయిన జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టులకు నియామకాల ప్రక్రియను చేపట్టాలని హైకోర్టు

జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టులను భర్తీచేయండి

హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 29 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ పంపిణీ సంస్థ టీఎ్‌సఎ్‌సపీడీసీఎల్‌లో భర్తీ కాకుండా మిగిలిపోయిన జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టులకు నియామకాల ప్రక్రియను చేపట్టాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మిగిలిపోయిన దాదాపు 550 పోస్టులను నూతన రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రస్తావన లేకుండా పాత జిల్లాల ప్రాతిపదికనే భర్తీ చేయాలని సూచించింది. ఈ సంస్థ 2019లో ఇచ్చిన నోటిఫికేషన్‌లో దాదాపు 1950 పోస్టులు ఇప్పటికే భర్తీకాగా, మిగిలిపోయిన పోస్టులను కొత్త జిల్లా ప్రాతిపాదికన స్థానికులకు 95 శాతం రిజర్వేషన్‌ ఇవ్వనున్నట్లు ప్రొసీడింగ్స్‌ ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పాత ఉమ్మడి జిల్లాలకు చెందిన అభ్యర్థులు వేర్వేరుగా హైకోర్టులో 30 పిటిషన్‌లు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. పై విధంగా తీర్పు వెలువరించింది.

Updated Date - Mar 01 , 2024 | 03:45 AM