Share News

రూ.5 కోసం కొట్లాట..

ABN , Publish Date - May 24 , 2024 | 11:16 PM

రూ. 5 కోసం ఇద్దరి ఽమధ్య జరిగిన వాగ్వాదం చేయి చేసుకుని గాయపరిచే వరకు చేరుకుంది. వికారాబాద్‌ మునిసిపల్‌ పరిధిలోని గిరిగెట్‌పల్లిలో కల్లు సీసా ధర రూ.10 ఉండేది. కానీ ఇటీవల కల్లు ధర రూ.15లకు పెంచి విక్రయిస్తున్నారు.

రూ.5 కోసం కొట్లాట..

కల్లు ధర ఎలా పెంచుతారంటూ వాగ్వాదం

పోలీసు స్టేషన్‌కు చేరిన పంచాయితీ

కేసులు నమోదు చేసిన పోలీసులు

వికారాబాద్‌, మే 24 : రూ. 5 కోసం ఇద్దరి ఽమధ్య జరిగిన వాగ్వాదం చేయి చేసుకుని గాయపరిచే వరకు చేరుకుంది. వికారాబాద్‌ మునిసిపల్‌ పరిధిలోని గిరిగెట్‌పల్లిలో కల్లు సీసా ధర రూ.10 ఉండేది. కానీ ఇటీవల కల్లు ధర రూ.15లకు పెంచి విక్రయిస్తున్నారు. ఈ విషయం తెలియని మునిసిపాలిటీలో కార్మికుడిగా పనిచేస్తున్న శ్రీనివాస్‌ గురువారం సాయంత్రం తన పని పూర్తయిన తరువాత కల్లు దుకాణానికి వెళ్లాడు. అక్కడ కల్లు తీసుకుని తాగాడు. ఎప్పటి మాదిరిగానే సీసా కల్లుకు రూ.10 ఇచ్చి వచ్చేందుకు ప్రయత్నించగా, కల్లు సీసా ధర రూ.15 అంటూ కల్లు వ్యాపారి చెప్పడంతో శ్రీనివాస్‌ వాగ్వాదానికి దిగాడు. కల్లు సీసా ధర రూ. 10 ఉంటే.. మీరు రూ.15లకు ఎలా పెంచుతారంటూ శ్రీనివాస్‌ కల్లు వ్యాపారి దత్తాత్రేయను ప్రశ్నించాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరిగి ఒకరిపై మరొకరు చేయి చేసుకునే వరకు వెళ్లింది. కల్లు వ్యాపారి తన అనుచరులతో తనపై జరిపిన దాడిలో తన తలపై రక్తగాయమైందని, శరీరంపై పలుచోట్ల వాతలు వచ్చాయని, అంతే కాకుండా తనను కులం పేరుతో దూషించారంటూ బాధితుడు శ్రీనివాస్‌ వాపోయాడు, ఇరువురు ఒకరిఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - May 24 , 2024 | 11:17 PM