Share News

పండుగలు ఐక్యతకు ప్రతీకలు

ABN , Publish Date - Jun 02 , 2024 | 12:15 AM

పండుగలు గ్రామాల్లో ఐక్యతకు ప్రతీకలని, ఆధ్యాత్మి కతను పెంపొందిస్తాయని ఉత్సవ కమిటీ బాధ్యులు అన్నారు.

పండుగలు ఐక్యతకు ప్రతీకలు
మునిపంపులలో బొడ్రాయి వద్ద పూజలు చేస్తున్న ఉత్సవ కమిటీ సభ్యులు

రామన్నపేట, జూన్‌ 1: పండుగలు గ్రామాల్లో ఐక్యతకు ప్రతీకలని, ఆధ్యాత్మి కతను పెంపొందిస్తాయని ఉత్సవ కమిటీ బాధ్యులు అన్నారు. మండలంలోని మునిపంపుల గ్రామంలో బొడ్రాయి ప్రథమ వార్షికోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా గ్రామ దేవతలను అలంకరించి, తోరణాలు కట్టారు. ఉదయం గణపతి పూజ, యజ్ఞం నిర్వహించారు. గ్రామంలోని మహిళలంతా శీత పరమేశ్వరికి జలాభిషేకం చేశారు. బోనాలు సమర్పించారు. కార్యక్రమాల్లో ఉత్సవ కమిటీ సభ్యులు మామిడి పద్మారెడ్డి, గునుగుంట్ల సత్తయ్య, మాజీ సర్పంచులు యాదాసు కవిత యాదయ్య, ఉయ్యాల లక్ష్మీనర్సు, మామిళ్ల శేషాద్రి, డోగిపర్తి జానకి రాములు, కట్టా యాదయ్య, కూనూరు రవికుమార్‌, కుక్కడపు రమేష్‌, మామిండ్ల కుమారస్వామి, జంపాల ఉమాపతి, భాషపాక యాదయ్య ఉన్నారు.

Updated Date - Jun 02 , 2024 | 12:15 AM