ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలి: ఎస్‌ఎఫ్‌ఐ
ABN , Publish Date - Apr 03 , 2024 | 11:56 PM
నేడు చదువు అంగట్లో సరుకుగా మారిందని, రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రూ. 7,200కోట్ల స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా ఉపాధ్యక్షుడు లావుడియ రాజు డిమాండ్ చేశారు.

భూదానపోచంపల్లి, ఏప్రిల్ 3 : నేడు చదువు అంగట్లో సరుకుగా మారిందని, రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రూ. 7,200కోట్ల స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా ఉపాధ్యక్షుడు లావుడియ రాజు డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలో ఎస్‌ఎ్‌ఫఐ మండల మహాసభ పరమేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా భగతసింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ పెంచిన మెస్, కాస్మోటిక్‌చార్జీలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అవకాశవాద రాజకీయ పక్షాలను ఓడించాలన్నారు. మతోన్మాద రాజకీయాలు చేస్తున్న బీజేపీని ఓడించాలన్నారు. కేంద్రంలో బీజేపీ సర్కారును గద్దె దించేందుకు విద్యార్థులు, యువకులు నడుం బిగించాలన్నారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని అన్నారు. మహాసభలో ఎస్‌ఎ్‌ఫఐ మండల అధ్యక్ష, కార్యదర్శులు పరమేష్, సాయినాథ్, ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా నాయకులు మాచర్ల మధు, అజయ్, నందు, ప్రసాద్, నరేష్ పాల్గొన్నారు.