రైతులను ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదు
ABN , Publish Date - Oct 25 , 2024 | 12:59 AM
ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులను ఇబ్బం దు లకు గురి చేస్తే సహించేది లేదని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొ న్నారు.

ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
పెగడపల్లి, అక్టోబరు 24 : ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులను ఇబ్బం దు లకు గురి చేస్తే సహించేది లేదని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొ న్నారు. మండలంలోని పలు గ్రామాలలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఆయా గ్రామాలలో రైతులనుద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు 17 తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని ఖ చ్చితంగా కొనుగోలు చేస్తారని, గతంలో మాదిరిగా కటింగ్‌ల పేరుతో ఇబ్బందు ల కు గురి చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. వ్యవసాయాదికారులు స ర్టిఫై చేసిన సన్న రకం ధాన్యాన్ని రూ. 500 బోనస్‌తో కొనుగోలు చేయనున్నట్లు , రైతులు దళారులకు విక్రయించి మోసపోకూడదన్నారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీలు కాసుగంటి రాజేందర్ రావు, శోభారాణి, పార్టీ అధ్యక్షులు రాములు గౌ డ్, డీఎం సివిల్ సప్లై జితేంద్ర ప్రసాద్, తహసీల్దార్ రవీందర్, డీపీఎం మల్లేశం, ఉన్నారు.