Share News

Manchiryāla- రైతు సంక్షేమమే ధ్యేయం

ABN , Publish Date - Mar 06 , 2024 | 09:53 PM

రైతుల సంక్షేమమే ధ్యేయంగా రైతు నేస్తం కార్యక్ర మాన్ని ప్రభుత్వం చేపట్టిందని జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. రైతు నేస్తం కార్యక్రమానికి బెల్లంపల్లి మండల ప్రత్యేకాధికారి దుర్గా ప్రసాద్‌తో కలిసి హాజరయ్యారు.

Manchiryāla-    రైతు సంక్షేమమే ధ్యేయం
కన్నాలలో వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ సంతోష్‌

బెల్లంపల్లి, మార్చి 6: రైతుల సంక్షేమమే ధ్యేయంగా రైతు నేస్తం కార్యక్ర మాన్ని ప్రభుత్వం చేపట్టిందని జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. రైతు నేస్తం కార్యక్రమానికి బెల్లంపల్లి మండల ప్రత్యేకాధికారి దుర్గా ప్రసాద్‌తో కలిసి హాజరయ్యారు. కలెక్టర్‌కు టీపీసీసీ ప్రచార కమిటీ జాయింట్‌ కన్వీనర్‌ నాతరి స్వామి, ఎంపీపీ శ్రీనివాస్‌, అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని 110 రైతు వేదికల్లో వీడియోకాన్ఫరెన్స్‌ సౌకర్యాన్ని కల్పించడం ద్వారా రైతులతో ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడతారని తెలిపారు. కార్యక్ర మంలో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు సురేష్‌, ఎంపీపీ శ్రీనివాస్‌, అధికార ులు, రైతులు , సిబ్బంది పాల్గొన్నారు. కన్నాల గ్రామ రైతు వేదికలో బుదవారం సీఎం రేవంత్‌రెడ్డి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించి రైతులతో మాట్లాడారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి దుర్గా ప్రసాద్‌, ఏడీ సురేఖ, తహసీల్దార్‌ ప్రసాద్‌, ఎంపీఈవో మహేంద ర్‌, ఏవోలు వందన, కిరణ్మయి, ఏఈవోలు నాగదీప్తి, శ్రీనివాస్‌, పుష్ప, శంకర్‌, రైతులు పాల్గొన్నారు.

భీమిని: మండలంలోని భీమిని రైతు వేదకలో బుదవారం సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రా వులు వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా రైతులతో మాట్లాడారు. కార్యక్రమంలో భీమిని డివిజన్‌ వ్యవసాయ సహాయ సంచాలకులు ఇంతియాజ్‌, నోడల్‌ ఆఫీసర్‌ దత్తరావు, ఏఈవోలు విజయ్‌కుమార్‌,ప్రేమ్‌కుమార్‌, తహసీల్దార్‌ బికర్ణదాస్‌, ఏఈవో వినోద్‌కుమార్‌, విస్తరణ అధికారులు, జెడ్పీటీసీ పోతు రాజుల గంగక్క, ఎంపీపీ పోతురాజుల రాజేశ్వరి, రైతులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2024 | 09:53 PM