Share News

రైతుల ఆత్మహత్యలు బీఆర్‌ఎస్‌ వైఫల్యమే

ABN , Publish Date - Apr 02 , 2024 | 04:33 AM

కొత్త ప్రభుత్వం ఏర్పాటైన వంద రోజుల్లో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారూ అంటే..

 రైతుల ఆత్మహత్యలు బీఆర్‌ఎస్‌ వైఫల్యమే

తెలంగాణ రైతు రక్షణ సమితి

కొత్త ప్రభుత్వం ఏర్పాటైన వంద రోజుల్లో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారూ అంటే.. అది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యమేనని తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు అన్నారు. ఒక్కసారి వచ్చిన నష్టంతో రైతు ఆత్మహత్య చేసుకోడని, వరుస నష్టాలు వచ్చి.. ఆత్మగౌరవంతో బతకలేని పరిస్థితులు వచ్చినప్పుడే బలవన్మరణానికి పాల్పడతాడని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో రైతులకు వరుసగా పంట నష్టాలు జరుగుతుంటే ఆ ప్రభుత్వం సంబంధంలేకుండా వ్యవహరించిందన్నారు. వడగండ్ల వానలతో పంటకు నష్టం వాటిల్లగానే ఎకరాకు రూ. పది వేల చొప్పున పరిహారం ప్రకటించిన రేవంత్‌ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Apr 02 , 2024 | 09:31 AM