Share News

కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది కలుగొద్దు

ABN , Publish Date - Nov 13 , 2024 | 12:21 AM

ధాన్యం కొను గోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బంది కలుగకుం డా కొను గోళ్లు వేగవంతం చేయాలని కలెక్టర్‌ సత్య ప్రసాద్‌ సంబంధిత అఽధికారులను ఆదేశించారు.

కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది కలుగొద్దు

కలెక్టర్‌ సత్యప్రసాద్‌

వెల్గటూర్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొను గోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బంది కలుగకుం డా కొను గోళ్లు వేగవంతం చేయాలని కలెక్టర్‌ సత్య ప్రసాద్‌ సంబంధిత అఽధికారులను ఆదేశించారు. మం గళవారం మండలంలోని శాఖాపూర్‌ కొనుగోలు కేంద్రా న్ని ఆకస్మి కంగా సందర్శించారు. కొనుగోలు కేంద్రానికి సంబంధించిన రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ తేమ శాతం వచ్చిన ధాన్యా న్ని వెంటది వెంట తూకం వేసి మిల్లులకు తరలించా లన్నారు. కొను గోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగ కుండా తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని అవసరమైతే అ దనంగా కాంటాలు సమకూర్చి తూకం వేసేలా చూడా లని ఆదేశించారు. ఆర్డీవో మధుసుదన్‌, డీఆర్డీవో రఘు వరణ్‌, మండల రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

రాయికల్‌: రైతులకు ఇబ్బందులు కలుగకుండా ధా న్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జగిత్యాల జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ బీఎస్‌ లత అన్నారు. మండ లంలోని రాయికల్‌, ఇటిక్యాల, అల్లీపూర్‌ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆమె పరిశీలించారు. ఈ సం దర్భంగా అడిషనల్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కావాల్సిన కనీస సౌకర్యాలను ఏర్పా టు చేయాలని, ధాన్యం కొనుగోళ్లను త్వరిత గతిన పూర్తి చేయాలని అన్నారు. పలు కేంద్రాలల్లో ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మ ధుసూదన్‌, తహసీల్దార్‌ ఎండీ ఖయ్యూం పాల్గొన్నారు.

ఎండపల్లి: రైతులు పంటను అమ్ముకునేందుకు ఎ లాంటి ఇబ్బందులు కలిగించొద్దని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎండప ల్లి గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీ లించారు. రైతులను తగు సూచనలు చేశారు. వడ్ల తే మ శాతాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. అనంతరం గ్రామా లలో నిర్వహిస్తున్న కుల గణన సర్వేను పరిశీలించారు. అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. ఆర్డీవో మధుసుధన్‌ పాల్గొన్నారు.

మల్యాల: మండలంలోని మల్యాల, ముత్యంపేటలో గల వరి ధాన్యం కొనుగో లు కేంద్రంను అడిషనల్‌ కలెక్టర్‌ బీఎస్‌ ల త పరిశీలించారు. ఈ సందర్భంగా ధా న్యం తేమ శాతం, మిల్లులకు తరలింపు అ డిగి తెలుసుకున్నారు. తూకం త్వరిత గతి న పూర్తి చేసి వెంటనే తరలించాలని నిర్వ హకులకు సూచించారు. ఆర్‌ఐ తిరుపతి, విండో సీఈవో శ్రీనివాస్‌, డైరెక్టర్‌ సంత ప్ర కాశ్‌రెడి,్డ రైతులు ఉన్నారు

సన్న రకాల ధాన్యం సేకరణ పరిశీలన

జగిత్యాలరూరల్‌ : జగిత్యాల రూరల్‌ మండలంలోని వెల్ధుర్థి ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేం ధ్రంలోని సన్నర కాల ధాన్యం సేకరణను మంగళవా రం ఐకేపీ ఏపీఎం గంగాధర్‌, ఏఇవో రమ్య పరిశీలించా రు. ఈసంధర్బంగా వారు మాట్లాడుతూ వెల్ధుర్థి గ్రా మంలో రైతులు ఎక్కువ మొత్తంలో సన్నరకం ధాన్యాన్ని పండించారన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగో లు కేంద్రాల్లోనే రైతులు ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో సీసీలు మరి యా, వీవోఏ జల, కమిటీస భ్యులు, రైతులు, హమా లీలు, పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2024 | 12:21 AM