Share News

రైతులు మద్దతు ధర పొందాలి

ABN , Publish Date - Mar 28 , 2024 | 11:50 PM

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి రైతులు ప్రభుత్వం అందించే మద్దతు ధర పొందాలని డీఎస్‌వో వెంకటేశ్వర్‌రావు

రైతులు మద్దతు ధర పొందాలి
తిప్పర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తున్న డీఎస్‌వో వెంకటేశ్వర్‌రావు

డీఎస్‌వో వెంకటేశ్వర్‌రావు

తిప్పర్తి, మార్చి 28: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి రైతులు ప్రభుత్వం అందించే మద్దతు ధర పొందాలని డీఎస్‌వో వెంకటేశ్వర్‌రావు అన్నారు. మండల కేంద్రంలోని మార్కెట్‌యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని మార్కెట్‌కు తీసుకువచ్చిన వెంటనే మ్యాయిచర్‌ 17శాతం వచ్చే వరకు ఆరబెట్టుకోవాలని సూచించారు. తద్వారా ప్రభుత్వం కల్పించే రూ.2,203 మద్దతు పొందవచ్చని తెలిపారు. ప్రస్తుతం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనందున రైతులు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని బయటి వ్యాపారులకు ధాన్యం అమ్ముకొని నష్టపోవొద్దని సూచించారు. సరైన ధాన్యం ఉన్న రైతులను రోజుల తరబడి మార్కెట్‌లో పడిగాపులు పడనివ్వకుండా మార్కెట్‌ నిర్వాహకులు త్వరతగతిన కాంటాలు వేయించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎస్‌వో కిరణ్‌కుమార్‌, డీఎం నాగేశ్వర్‌రావు, ఎంపీడీవో వెంకట్‌రెడ్డి, ఏవో సన్నిరాజు, సీఈవో పి. భిక్షమయ్య, ఏఈవోలు సంతోషిని, అవినాష్‌ తదితరులు పాల్గొన్నారు.

రైతులకు ఇబ్బందులు కలగకుండా కోనుగోలు చేయాలి

నల్లగొండ రూరల్‌: రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డీఆర్‌డీఏ పీడీ టీ. నాగిరెడ్డి అన్నారు. మండలంలోని ఖాజిరామారం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. కొనుగోలు చేసిన ధాన్యం ట్రక్‌షీట్లను ఎప్పటికప్పుడు నమోదు చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. తేమ 17శాతం మించకుండా కళ్లాల వద్దే ధాన్యం ఆరబెట్టి కొనుగోలు కేం ద్రాలకు తీసుకురావాలని సూచించారు. రైతులు కొనుగోలు కేంద్రం వద్ద ఆధార్‌ కార్డు, పట్టదారు పాసుబుక్‌, బ్యాంక్‌ ఖాతాలను తీసుకొని ఓటీపీ నమోదు చేసుకోవాలన్నారు. తేమ శాతం 17లోపు ఉండి, ఓటీపీ రాకుంటే కొనుగోలు చేయడం వీలుకాదన్నారు. రైతులు ఇబ్బందులు పడకుండా ముందుగానే సరి చూసుకోవాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు రెండు, మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేసే విధంగా చేస్తామన్నారు. సీరియల్‌ ప్రకారం ధాన్యం కొనుగోలు చేయాలని, కొనుగోలు చేయడంలో రైతులకు ఇబ్బంది కలిగించవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పి. వెంకట్‌రెడ్డి, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఏవో సునకోజు శ్రీనివాస్‌, ఏఈవో డీపీఎం అరుణ్‌కుమార్‌, ఏపీఎం వినోద, సీసీ గీత, సంఘం బంధం అధ్యక్షురాలు నకిరేకంటి లక్ష్మీ, కార్యదర్శి అండాలు, రాచకొండ సూజాత, వీవోఏ కృష్ణవేణికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2024 | 11:50 PM