Share News

రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

ABN , Publish Date - Apr 05 , 2024 | 12:08 AM

రైతులు కొనుగోలు కేంద్రాల కు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి గిట్టుబాటు ధర పొందాల ని చండూరు ఆర్డీవో సుబ్రహ్మణ్యం అన్నారు.

 రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
కస్తాల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఆర్డీవో సుబ్రహ్మణ్యం

రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

చండూరురూరల్‌, ఏప్రిల్‌ 4: రైతులు కొనుగోలు కేంద్రాల కు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి గిట్టుబాటు ధర పొందాల ని చండూరు ఆర్డీవో సుబ్రహ్మణ్యం అన్నారు. చండూరు మండలపరిధిలోని కస్తాల గ్రామంలో గురువారం ఎఫ్‌ఎ్‌ససీఎస్‌ చండూ రు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆ యన ప్రారంభించి మాట్లాడా రు. రైతులందరూ తమ ధాన్యా న్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చే ముందే ఇంటి వద్ద లే క కల్లాల వద్ద ఆరబెట్టుకుని, తగిన తేమతో, మట్టి పెళ్లలు లేకుండా నాణ్యత కలిగిన ధా న్యాన్ని తీసుకురావాలని సూ చించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభు త్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్‌ఐ దశరథ, ఏవో రేవతి, ఏఈ వో శ్రీలేఖ, మానిటరింగ్‌ ఆఫీసర్‌ షణ్ముకచారి, ఇనచార్జి సీఈవో, ఎఫ్‌ఎ్‌ససీఎస్‌ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

చిట్యాలరూరల్‌: గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పీఏసీఎస్‌ మానిటరింగ్‌ అధికారి వంగూరి విజయకృష్ణ అన్నారు. మండలంలోని గుండ్రాంపల్లి, సుంకెనపల్లి, వెలిమినేడు, పిట్టంపల్లి, చిన్నకాపర్తి, ఆరెగూడెం గ్రామాల్లో గురువారం పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆ యన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రై తులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని ప్రైవేటు వ్యక్తులను నమ్మి ధాన్యాన్ని వారికి విక్రయించి మోసపోవొద్దన్నా రు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధరను పొందాలన్నారు. ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి రైతుల వివరాలను నిర్వాహకులు వెంటనే న మోదు చేయాలని రైతులకుచ ఎ లాంటి ఇబ్బందుకు కలిగించవద్దన్నారు. కార్యక్రమంలో రాజమల్ల య్య, బొంతల రాజిరెడ్డి, పిశాటి భీష్మారెడ్డి, రాకేష్‌, అరవింద్‌, మ హేష్‌, విజయ్‌ పలువురు రైతు లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 05 , 2024 | 12:08 AM