Share News

రైతులు అధైర్యపడొద్దు

ABN , Publish Date - Aug 21 , 2024 | 11:31 PM

రైతులు అధైర్యపడొద్దని, అ ర్హులందరికీ రుణమాఫీ అవుతుందని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి అన్నారు.

 రైతులు అధైర్యపడొద్దు

- కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

వీపనగండ్ల, ఆగస్టు 21: రైతులు అధైర్యపడొద్దని, అ ర్హులందరికీ రుణమాఫీ అవుతుందని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి అన్నారు. బుధవారం వీపనగండ్ల మండల పరిధిలోని కల్వ రాల, వీపనగండ్ల గ్రామాలలో పంటలను పరిశీలించారు. ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పంటల వివరాలను నమోదును చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వస్తున్నారా అని రైతు లను అడిగి తెలుసుకున్నారు. కల్వరాల, వీపనగండ్ల మ ధ్య భీమా కాలువ శిథిలావస్థలో ఉందని రైతు రమేష్‌గౌడ్‌ కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. వెంటనే పరిశీలించిన కలెక్టర్‌ శిథిలావస్థలో ఉన్న కాలువలను వెంటనే మరమ్మతులు చే యాలని బీమా ఎస్‌ఈ సత్యాశీలారెడ్డిని ఫోన్‌ ద్వారా ఆదేశించారు. అనంతరం వీపనగండ్ల కస్తూర్బా, జడ్పీహెచ్‌ ఎస్‌ బాలికల, ప్రాథమిక పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాల పరిసరా ప్రాంతా లను పరిశుభ్రంగా ఉంచాలని కల్పించాలని అధికారులను ఆదేశించారు. బాలికల పాఠశాలలో నాణ్యతలేని భోజనం అందిస్తున్నారని ఆరోపణలపై కలెక్టర్‌ ఉపాధ్యాయులతో కలిసి భోజనం చేశారు. కొత్తకోటలో ఉన్న ఎస్సీ గురుకుల పాఠశాలను వీపనగండ్లకు తెప్పించాలని మాజీ సర్పంచు గంగిరెడ్డి కోరారు. కలెక్టర్‌ వెంట ఏడీ చంద్రశేఖర్‌, ఏవో డాకేశ్వర్‌గౌడ్‌, ఏఈవో రజిత, బాలరాజు, రైతులు రమేష్‌గౌడ్‌, వెంకటయ్య, శివ, నాగిరెడ్డి పాల్గొన్నారు.

పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

పాన్‌గల్‌ : జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాలల పనుల ను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంలోని దళితవాడ ప్రాథమిక పాఠశాలలోని పనులను పరిశీలించారు. అంత కు ముందు కస్తూర్బాగాంధీ విద్యాలయంలో కాంపౌండ్‌ వా ల్‌కు ఫెన్సింగ్‌, తాగునీటి బోర్‌వెల్‌ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆ రోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఫీవర్‌ సర్వే నిర్వహించా లని డాక్టర్‌ చంద్రశేఖర్‌కు ఆదేశించారు. మండల పరిధి లోని బండపల్లి శివారులోని నరసింహ, యాలాల మల్మ మ్మ పొలాలను వ్యవసాయ విస్తీర్ణాధికారులు క్రాప్‌ బుకిం గ్‌ చేస్తుండగా కలెక్టర్‌ పరిశీలించారు. ఆయన వెంట ఎం పీడీవో గోవిందరావు, డిప్యూటీ తహసీల్దార్‌ అశోక్‌కుమార్‌, కస్తూర్బా ఎస్‌వో హేమలత, ఏఈవోలు పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2024 | 11:31 PM