Share News

ధాన్యం చోరీతో రైతుల ఆందోళన

ABN , Publish Date - Apr 03 , 2024 | 11:35 PM

రైతులు ఆరుగాలం పండించిన ధాన్యా న్ని గుర్తు తెలియని దుండగులు చోరీ చేస్తున్నారు. నార్కట్‌పల్లి మం డలంలో ధాన్యం వరుస దొంగతనాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

 ధాన్యం చోరీతో రైతుల ఆందోళన
బాధిత రైతు ధాన్యం రాశిని పరిశీలిస్తున్న తోటి రైతులు

ధాన్యం చోరీతో రైతుల ఆందోళన

నార్కట్‌పల్లి, ఏప్రిల్‌ 3: రైతులు ఆరుగాలం పండించిన ధాన్యా న్ని గుర్తు తెలియని దుండగులు చోరీ చేస్తున్నారు. నార్కట్‌పల్లి మం డలంలో ధాన్యం వరుస దొంగతనాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ధాన్యం దొంగతనం చేయడం ఏమిటని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది తామెప్పుడూ చూడలేదని పేర్కొంటున్నారు. నార్కట్‌పల్లి మండలంలోని అక్కెనపల్లిలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి గాయం నరేందర్‌రెడ్డి అనే రైతుకు చెందిన సుమారు 10 క్వింటాళ్ల ధాన్యం గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన జరిగి మూ డు రోజులు గడవకముందే తాజాగా అమ్మనబోలులో కూడా ఇలాంటి ఘటనే పునరావృతమైంది. అమ్మనబోలు గ్రామ పంచాయతీ పరిధిలోని వెంకటాపురం గ్రామానికి చెందిన నల్ల పిచ్చిరెడ్డి అనే రైతు తన పొలంలో వరి కోసి ట్రాక్టర్ల ద్వారా ధాన్యాన్ని పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రానికి మంగళవారం సాయంత్రం తీసుకువచ్చి కుప్పలు పోశాడు. బుధవారం వెళ్లి చూసేసరికి తన కుప్ప నుంచి సుమారు 25 క్వింటాళ్ల ధాన్యం ఎత్తుకుపోయినట్లు గుర్తించాడు. కుప్ప వద్ద టాటా ఏసీ వాహనానికి చెందిన టైర్ల గుర్తులు పడ్డాయని పేర్కొన్నాడు. అందులోనే ఎత్తుకెళ్లి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. గతంలో ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరగలేదని వాపోయాడు. ఒకటీ రెండు రోజులంటే కాపలా ఉంటాం కానీ ఎప్పుడు కొంటారో తెలియని పరిస్థితుల్లో కుప్పల వద్ద రాత్రిళ్లు కాపలా ఉండలేమని వాపోతున్నారు.

Updated Date - Apr 03 , 2024 | 11:35 PM