Share News

పని ప్రదేశాల్లో వసతులు కల్పించాలి

ABN , Publish Date - Apr 05 , 2024 | 11:53 PM

: ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు పని ప్రదేశాలలో కనీస వసతులు కల్పించాలని సీపీఐఎంల్‌ మాస్‌లైన్‌ జిల్లా కమిటీ సభ్యుడు పేర్ల నాగయ్య డిమాండ్‌ చేశారు.

పని ప్రదేశాల్లో వసతులు కల్పించాలి
ఉపాధి కూలీలతో మాట్లాడుతున్న నాగయ్య

నాగారం, ఏప్రిల్‌ 5: ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు పని ప్రదేశాలలో కనీస వసతులు కల్పించాలని సీపీఐఎంల్‌ మాస్‌లైన్‌ జిల్లా కమిటీ సభ్యుడు పేర్ల నాగయ్య డిమాండ్‌ చేశారు. మండలంలోని పసునూరు గ్రామంలో శుక్రవారం ఉపాధిహామీ కూలీలతో మాట్లాడారు. గ్రామాల్లో వేసవిలో పనిచేస్తున్న ఉపాధి కూలీలకు నీడ, మంచినీటి సౌకర్యం కల్పించి రోజుకు రూ.500 చోప్పున వేతనం చెల్లించాలన్నారు. ఉపాధి హామీ కూలీలకు కనీసం నీడ సదుపాయం లేకుండా మంచీనిటి సౌకర్యం కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఎండలో పనిచేయించడం తగదన్నారు. మూడు నెలల నుంచి ఉపాధి పనులు చేస్తున్న కూలీలకు వేతనాలు అందలేదని, బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆపార్టి నాయకులు వేల్పుల లక్ష్మయ్య, పరుశురాం, నరేష్‌, రమేష్‌, బిక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 05 , 2024 | 11:53 PM