Share News

ఇంటర్‌ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

ABN , Publish Date - Jan 28 , 2024 | 03:38 AM

ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ఇంటర్‌ బోర్డు పొడిగించింది. ఈ నెల 29వ తేదీ లోపు రూ.4000 ఆలస్య రుసుముతో కలిపి ఫీజును చెల్లించే వెసులుబాటు కల్పించింది.

ఇంటర్‌ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

హైదరాబాద్‌, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ఇంటర్‌ బోర్డు పొడిగించింది. ఈ నెల 29వ తేదీ లోపు రూ.4000 ఆలస్య రుసుముతో కలిపి ఫీజును చెల్లించే వెసులుబాటు కల్పించింది. ఈమేరకు కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ శనివారం ఉత్తర్వులను జారీ చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల విజ్ఞప్తుల మేరకు తేదీని పెంచుతున్నామని తెలిపింది. ఇంటర్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు గడువులోగా ఫీజు చెల్లించేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని జూనియర్‌ కాలేజీల ప్రిన్సిపాళ్లను ఆదేశించింది. కాగా, పదో తరగతి ఫెయిల్‌ అయిన విద్యార్థులు తత్కాల్‌ స్కీమ్‌ కింద చెల్లించే ఫీజు గడువును ఫిబ్రవరి 5 వరకు పెంచుతూ ప్రభుత్వ పరీక్షల సంచాలకులు ఓ ప్రకటనలో తెలిపారు. మార్చిలో జరిగే ఈ పరీక్షల కోసం రూ.1000 ఆలస్య రుసుముతో కలిపి ఫిబ్రవరి 5లోపు చెల్లించాలని పేర్కొన్నారు.

Updated Date - Jan 28 , 2024 | 11:24 AM