Share News

మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఊరట

ABN , Publish Date - Mar 12 , 2024 | 03:51 AM

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును మోసం చేసిన కేసులో ఐదేళ్ల జైలుశిక్ష పడిన ఏపీకి చెందవిన మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు తెలంగాణ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఆమెకు సీబీఐ కోర్టు

మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఊరట

హైదరాబాద్‌, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును మోసం చేసిన కేసులో ఐదేళ్ల జైలుశిక్ష పడిన ఏపీకి చెందవిన మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు తెలంగాణ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఆమెకు సీబీఐ కోర్టు విధించిన జైలుశిక్షను సస్పెండ్‌ చేస్తూ జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ధర్మాసనం తాజాగా మధ్యంతర ఆదేశాలు జారీచేసింది. ఈ జైలుశిక్షపై హైకోర్టు 2022లోనే స్టే విధించింది. అయితే లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీచేస్తున్నానని.. ట్రయల్‌ కోర్టు విధించిన జైలుశిక్షను సస్పెండ్‌ చేయాలని.. లేనిపక్షం లో ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్‌ 8 ప్రకారం తనపై అనర్హత వేటు పడుతుందని గీత మధ్యంతర పిటిషన్‌ దాఖలు చేశారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. జైలుశిక్షపై గతంలోనే స్టే విధించినందున పిటిషనర్‌ విజ్ఞప్తి మేరకు ట్రయల్‌ కోర్టు విధించిన శిక్షను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రధాన పిటిషన్లపై విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది.

Updated Date - Mar 12 , 2024 | 03:51 AM