Share News

Excise Department : ఎక్సైజ్‌ శాఖలో భారీ ప్రక్షాళన

ABN , Publish Date - Feb 13 , 2024 | 03:59 AM

రాష్ట్రంలోని వివిధ శాఖల్లో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతోంది. మరో రెండు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఎన్నికలతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధమున్న అధికారులను బదిలీ చేయాలని

Excise Department : ఎక్సైజ్‌ శాఖలో భారీ ప్రక్షాళన

ఒకేసారి 223 మంది అధికారుల బదిలీ.. 149 మంది ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం

ఇద్దరు డీసీలు, 9 మంది ఏసీలు, 14 మంది ఈఎ్‌సలకు కూడా..

అప్పటి మంత్రి అండతో అందలమెక్కినవారికి తప్పని బదిలీ

లోక్‌సభ ఎన్నికల ముంగిట ఈసీ ఆదేశాల మేరకు ప్రక్రియ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వివిధ శాఖల్లో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతోంది. మరో రెండు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఎన్నికలతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధమున్న అధికారులను బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖలో భారీ ప్రక్షాళనను చేపట్టింది. ఒకేసారి శాఖలోని 223 మందిని బదిలీ చేసింది. ఎక్సైజ్‌, వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ, ఎక్సైజ్‌ కమిషనర్‌ ఇ.శ్రీధర్‌ సోమవారం బదిలీలకు సంబంధించిన పలు జీవోలను జారీ చేశారు. ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ మొదలు.. డిప్యూటీ కమిషనర్ల వరకు బదిలీ చేశారు. గత నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి ఒక మంత్రి అండదండలతో 30 మంది ఎక్సైజ్‌ అధికారులను బదిలీ చేసి, కీలక స్థానాల్లో పోస్టింగులు ఇచ్చారు. ఇప్పుడు అలాంటి అధికారులందరికీ బదిలీ వేటు తప్పలేదు. చాలా కాలంగా హైదరాబాద్‌ నగర సమీపంలో ఒకే స్థానంలో కొనసాగుతోన్న ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ను మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాలో ఏర్పడిన కొత్త జిల్లాకు పంపించారు. సంఘాల పేరుతో నగర సమీపంలో కొనసాగుతున్న అధికారులను కూడా బదిలీ చేశారు.

చాలా కాలంగా నాన్‌-ఫోకల్‌ పాయింట్లలో పని చేస్తున్నవారినీ బదిలీ చేసి, కీలక స్థానాల్లో నియమించారు. దీంతో అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో చక్రం తిప్పిన అధికారులు ఇప్పుడు.. మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్‌(డీసీ) టి.డేవిడ్‌ రవికాంత్‌ను కరీంనగర్‌ డీసీగా, నిజామాబాద్‌ డీసీ పి.దశరథను రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్‌గా బదిలీ చేశారు. తొమ్మిది మంది అసిస్టెంట్‌ కమిషనర్లు కూడా బదిలీ అయ్యారు. బ్రూవరీస్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌(ఏసీ) కె.వరప్రసాద్‌ను కరీంనగర్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏసీగా, అక్కడున్న ఏసీ ఎ.విజయభాస్కర్‌రెడ్డిని మహబూబ్‌నగర్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏసీగా, నిజామాబాద్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏసీ ఆర్‌.కిషన్‌ను రంగారెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏసీగా, ఆదిలాబాద్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏసీ జి.శ్రీనివా్‌సరెడ్డిని మెదక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏసీగా, రంగారెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏసీ ఎ.చంద్రయ్యను బ్రూవరీస్‌ ఏసీగా, మహబూబ్‌నగర్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏసీ హెచ్‌.దత్తురాజ్‌గౌడ్‌ను టీఎ్‌సబీసీఎల్‌ రంగారెడ్డి-1 చీఫ్‌ మేనేజర్‌గా, అక్కడున్న వి.సోమిరెడ్డిని నిజామాబాద్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏసీగా, మెదక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏసీ కె.రఘురామ్‌ను కమిషనర్‌ ఆఫీసులో డిప్యూటీ కమిషనర్‌గా, నల్లగొండ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏసీ ఎ.శంభుప్రసాద్‌ను కమిషనరేట్‌లో డిప్యూటీ కమిషనర్‌గా బదిలీ చేశారు.

14 మంది ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లకూ..

వివిధ ఎక్సైజ్‌ జిల్లాల్లో పనిచేస్తున్న 14 మంది జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ ఆఫీసర్ల(ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లు)ను బదిలీ చేశారు. ఈఎ్‌సలలో.. ఎంఏ రజాక్‌ను మెదక్‌ నుంచి నిర్మల్‌కు, ఎ.సత్యనారాయణ (శంషాబాద్‌ నుంచి జగిత్యాల), కె.అనిత (సూర్యాపేట నుంచి జనగామ), ఆర్‌.లక్ష్మానాయక్‌ (వరంగల్‌ రూరల్‌ నుంచి సూర్యాపేట), ఎస్‌.సైదులు (మహబూబ్‌నగర్‌ నుంచి యాదాద్రి), ఎస్‌.ఉజ్వలరెడ్డి (హైదరాబాద్‌-2 టీఎ్‌సబీసీఎల్‌ నుంచి సరూర్‌నగర్‌), ఎస్‌.కృష్ణప్రియను (జనగామ నుంచి శంషాబాద్‌), ఎస్‌కే ఫయాజుద్దీన్‌ (నాగర్‌కర్నూల్‌ నుంచి మేడ్చల్‌), కె.నవీన్‌కుమార్‌ (యాదాద్రి నుంచి మల్కాజిగిరి), కె.విజయభాస్కర్‌ (మేడ్చల్‌ నుంచి వికారాబాద్‌), ఎస్‌.నవీన్‌చంద్ర (వికారాబాద్‌ నుంచి సంగారెడ్డి), డి.గాయత్రి (సంగారెడ్డి నుంచి నాగర్‌కర్నూల్‌), డి.అరుణ్‌కుమార్‌ (మల్కాజిగిరి నుంచి గద్వాల్‌), టి.రవీందర్‌రావును సరూర్‌నగర్‌ నుంచి వనపర్తికి బదిలీ చేశారు. మరో నలుగురు అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్ల(ఏఈఎ్‌స)ను బదిలీ చేశారు. సరూర్‌నగర్‌ ఏఈఎస్‌ బి.హన్మంతరావును కామారెడ్డి ఏఈఎ్‌సగా, మల్లేపల్లిలోని బ్రూవరీ ఆఫీసర్‌ ఎం.విష్ణుమూర్తిని యాదాద్రి ఏఈఎ్‌సగా, మేడ్చల్‌లోని ఆర్‌కే డిస్టిలరీలో డిస్టిలరీ ఆఫీసర్‌గా ఉన్న జె.మర్ఫీని సిద్దిపేట ఏఈఎ్‌సగా, జగిత్య్చా ఏఈఎస్‌ డీసీబీ నాయక్‌ను నిజామాబాద్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏఈఎ్‌సగా బదిలీ చేశారు. మల్టీ జోన్‌-2లోని 85 మంది ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేశారు. మల్టీ జోన్‌-1లోని 64 మంది ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్లనూ బదిలీ చేశారు. మరో 45 మంది ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్లను కూడా బదిలీ చేశారు. కాగా వీరందరూ వెంటనే తమ తమ పోస్టుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఏడుగురు చీఫ్‌ ప్లానింగ్‌ ఆఫీసర్లకూ..

హైదరాబాద్‌, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఏడుగురు చీఫ్‌ ప్లానింగ్‌ ఆఫీసర్ల(సీపీవో)ను ప్రభుత్వం బదిలీ చేసింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం చేసిన ఆదేశాల మేరకు ఈ బదిలీలు చేపట్టింది. ఈమేరకు రాష్ట్ర ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి అహ్మద్‌ నదీం సోమవారం ఉత్తర్వులను జారీ చేశారు. నల్లగొండ సీపీవో ఎం.బాలశౌరిని సంగారెడ్డికి, అక్కడి డిప్యూటీ డైరెక్టర్‌(సీపీవో) ఎన్‌.మోహన్‌రెడ్డిని అర్థ గణాంక సంచాలకుల కార్యాలయంలో జాయింట్‌ డైరెక్టర్‌గా బదిలీ చేసింది. సంచాలకుల కార్యాలయంలో జేడీగా ఉన్న పి.సౌమ్యను ఖాళీగా ఉన్న రంగారెడ్డి సీపీవో పోస్టులో నియమించారు. యాదాద్రి-భువనగిరి జిల్లా సీపీవో బి.మాన్యను నల్లగొండ సీపీవోగా, సూర్యాపేట సీపీవో జి.వెంకటేశ్వర్లును యాదాద్రి-భువనగిరి సీపీవోగా బదిలీ చేశారు. సూర్యాపేట సీపీఓ కార్యాలయంలో స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌గా ఉన్న వి.శ్రీనివాసరావుకు సూర్యాపేట సీపీవోగా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. వరంగల్‌ సీపీవో జి.జీవరత్నంను బదిలీ చేసి, జోగుళాంబ-గద్వాల సీపీవోగా, అక్కడున్న సీపీవో బి.గోవిందరాజన్‌ను వరంగల్‌ సీపీవోగా నియమించారు.

పంచాయతీరాజ్‌ శాఖలో 105 మంది బదిలీ

ఇప్పటికే డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్ద్దార్లు, ఎంపీడీవోలను బదిలీ చేసిన ప్రభుత్వం.. తాజాగా పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖలోని జిల్లా స్థాయి అధికారులను బదిలీ చేసింది. జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారులు (జడ్పీసీఈవోలు), జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు (డీఆర్‌డీవోలు), జిల్లా పంచాయతీ అధికారులు (డీపీవోలు) సహా మొత్తం 105 మందిని బదిలీ చేస్తూ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి సందీ్‌పకుమార్‌ సుల్తానియా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - Feb 13 , 2024 | 03:59 AM