Share News

గుర్రంగడ్డలోని ఆలయం పరిశీలన

ABN , Publish Date - Feb 11 , 2024 | 10:55 PM

జములమ్మ పుట్టినిల్లు గుర్రగడ్డలో ఆలయాన్ని ఈవో పురేందర్‌కుమార్‌ ఆదివారం పరిశీలించారు.

 గుర్రంగడ్డలోని ఆలయం పరిశీలన
గుర్రంగడ్డలోని జములమ్మ ఆలయాన్ని పరిశీలిస్తున్న ఈవో పురేందర్‌ కుమార్‌

- ఈ నెల 20నుంచి జములమ్మ బ్రహ్మోత్సవాలు

- ఏర్పాట్లపై చర్చించిన ఈవో

గద్వాల, ఫిబ్రవరి 11: జములమ్మ పుట్టినిల్లు గుర్రగడ్డలో ఆలయాన్ని ఈవో పురేందర్‌కుమార్‌ ఆదివారం పరిశీలించారు. ఈ నెల 20నుంచి జములమ్మ బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతుండటంతో అక్కడ ఏర్పాట్లను ఈవో పరిశీలించారు. జమ్మిచేడులోని జములమ్మ ఆలయం నుంచి అమ్మవారిని తీసుకరావడానికి ఎద్దుల బండి వెళ్లనుంది. బీరెల్లి వైపు కృష్ణానదిలో పుట్టీలో దాటి పుట్టినింటిలో పూజలు చేసి అక్కడ నుంచి అమ్మవారిని తీసుకవస్తారు. దీంతో అక్కడి ఆలయాన్ని ముస్తాబు చేయడం, ఆలయ పూజారులతో పాటు పుట్టీ వేసేవారితో ఆయన మాట్లాడి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఆలయ ఉద్యోగులు సంజీవరెడ్డి, రవిప్రకాష్‌లు ఉన్నారు.

జడ్పీ చైర్‌పర్సన్‌ను ఆహ్వానించిన ఈవో

జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరితను ఆదివారం ఈవో పురేందర్‌కుమార్‌ క్యాంపు కార్యాలయంలో కలిసి జములమ్మ బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని కోరారు. ఈ నెల 20నుంచి పౌర్ణమిలోగా అమ్మవారిని దర్శించుకోవాలని ఆయన కోరారు.

Updated Date - Feb 11 , 2024 | 10:55 PM