Share News

అంతా పథకం ప్రకారమే చేశారు: అసదుద్దీన్‌

ABN , Publish Date - Jan 21 , 2024 | 02:43 AM

ఎంతో చరిత్ర కలిగి, 500 ఏళ్ల పాటు ముస్లింలు నమాజు చేసిన బాబ్రీ మసీదును పథకం ప్రకారమే వారి నుంచి దూరం చేశారని మజ్లిస్‌ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ మండిపడ్డారు.

అంతా పథకం ప్రకారమే చేశారు: అసదుద్దీన్‌

హైదరాబాద్‌, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): ఎంతో చరిత్ర కలిగి, 500 ఏళ్ల పాటు ముస్లింలు నమాజు చేసిన బాబ్రీ మసీదును పథకం ప్రకారమే వారి నుంచి దూరం చేశారని మజ్లిస్‌ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ మండిపడ్డారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసమే ప్రధాని మోదీ అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠను చేపట్టనున్నారని ఆరోపించారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేసిన ఆయన... కాంగ్రె్‌సకు చెందిన అప్పటి ఉత్తరప్రదేశ్‌ సీఎం జీబీ పంత్‌ మసీదులో విగ్రహాలను పెట్టారని విమర్శించారు. లేదంటే ఈ రోజు పరిస్థితి మరోలా ఉండేదన్నారు. ప్రతి మంగళవారం పాఠశాలల్లో సుందరకాండ, హనుమాన్‌ చాలీసా పఠించాలని నిర్ణయించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ సైతం ఓట్ల కోసం బీజేపీ బాటలో నడుస్తున్నారన్నారని ధ్వజమెత్తారు.

Updated Date - Jan 21 , 2024 | 08:41 AM