Share News

పార్లమెంట్‌ ఎన్నికలకు సర్వం సిద్ధం : కలెక్టర్‌

ABN , Publish Date - May 12 , 2024 | 12:07 AM

పార్లమెంట్‌ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావ్‌ అన్నారు. ఈవీఎంలు భద్రపరిచే గోదాముల్లో స్ర్టాంగ్‌ రూంలను ఎన్నికల సాదారణ పరిశీలకులు మనోజ్‌కుమార్‌ మాణిక్‌రావు సూర్యవంశీ తో కలిసి శనివారం తనిఖీ చేశారు.

పార్లమెంట్‌ ఎన్నికలకు సర్వం సిద్ధం : కలెక్టర్‌
ఈవీఎంల భద్రతను పరిశీలిస్తున్న కలెక్టర్‌ వెంకట్రావ్‌

సూర్యాపేట(కలెక్టరేట్‌), మే 11: పార్లమెంట్‌ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావ్‌ అన్నారు. ఈవీఎంలు భద్రపరిచే గోదాముల్లో స్ర్టాంగ్‌ రూంలను ఎన్నికల సాదారణ పరిశీలకులు మనోజ్‌కుమార్‌ మాణిక్‌రావు సూర్యవంశీ తో కలిసి శనివారం తనిఖీ చేశారు. పార్లమెంట్‌ పోలింగ్‌ పూర్తయిన తర్వాత పోలింగ్‌ ఈవీఎంలను 14వతేదీ మద్యరాత్రి ఉదయం 1గంటల వరకు నల్లగొండ జిల్లా కేంద్ర సమీపంలోని అనిశెట్టి దుప్పలపల్లిలో ఏర్పాటు చేసిన ఈవీఎం గోదాం స్ర్టాంగ్‌ రూంకు తరలించాలని సూచించారు. ఈనెల 13వతేదీన ఉదయం 7గంటల నుండి సాయంత్రం 6గంటల వరకు ఎన్నికలు జరుగుతాయన్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రం నుండి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈవీఎంలను పంచించామని తెలిపారు. నేడు డిస్టిబ్యూషన్‌ సెంటర్‌ల నుండ ఆయా పోలింగ్‌ స్టేషన్‌లకు ఎన్నికల సిబ్బందితో పాటు ఈవీఎంలు చేరుకుంటాయని తెలిపారు. జిల్లాలో 1201 పోలింగ్‌ కేంద్రాలుఏర్పాటు చేశామని క్రిటికల్‌ పోలింగ్‌ కేంద్రాలు 229 ఉన్నాయని అలాగే 112 రూట్లల్లో 123 సెక్టార్‌ అదికారులను నియమించామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవోలు వేణుమాదవ్‌, శ్రీనివాస్‌, సూర్యనారాయణ,శ్రీనివాస్‌, భూమన్న పాల్గొన్నారు.

తుంగతుర్తి: ఓటర్లందరూ స్వేచ్ఛ వాతావరణంలో తమ ఓటటు హక్కును వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్‌ జీఎస్‌ లత అన్నా రు. శనివారం మండల కేంద్రంలోని మైనారిటీ గురుకుల పాఠశాల నుంచి సిరి ఫంక్షన్‌ హాల్‌ వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ప్రజా స్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎండ వేడి లేకుండా టెంట్లు, తాగునీరు కల్పించామన్నారు. అంగవైకల్యం ఉన్న ఓటర్లకు పోలింగ్‌ కేంద్రాల వద్ద వీల్‌ చైర్‌ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ రమణారెడ్డి, ఎస్‌ఐ ఏడుకొండలు పాల్గొన్నారు.

మోతె: పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా వసతులు కల్పించాలని జిల్లా పం చాయతీ అధికారి సురేష్‌కుమార్‌ అన్నారు. మండల పరిధిలోని హుస్సేనాబాద, మోతె, నామవరం గ్రామాల్లో శనివారం పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించి మాట్లాడారు. ప్రతి బూత్‌లో ఓటర్లకు సంబం ఽధించిన ఓటరు లిస్టులో వివరాలు అందుబాటులో ఉంచాలి.సీసీ కెమెరాలు, మంచినీటి సౌకర్యం, పోలింగ్‌ కేంద్రంలో విద్యుత్‌ సమస్య లు లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపీడీవో హరిసింగ్‌నాయక్‌, మండల ప్రత్యేకాదికారి సీతారాములు ఉన్నారు.

మునగాల రూరల్‌: పోలింగ్‌ను సమర్ధవంతంగా నిర్వహించాలని మండల ఎన్నికల ప్రత్యేకాధికారి, జిల్లా మైనార్టీ వెల్ఫేర్‌ అధికారి కె. జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని బరాఖత్‌గూడెం, గణపవరం, తిమ్మారెడ్డిగూడెం, కొక్కిరేణి, మాధవరం, మునగాల గ్రా మాల్లో శనివారం పర్యటించారు. పోలింగ్‌ స్టేషన్లలో మౌలిక సదుపాయాలను పరిశీలించి సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో రమేష్‌ దీన్‌దయాల్‌, ఆర్‌ఐ రాధా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 12 , 2024 | 12:07 AM