Share News

ప్రతీ ఒక్కరు ఓటు వేయాలి

ABN , Publish Date - Apr 19 , 2024 | 11:22 PM

ప్రజాస్వామ్యం లో ఓటు వజ్రాయుధం లాంటిదని, ఓటు హక్కు క లిగిన ప్రతీ ఒక్కరు ఓటు వేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు.

ప్రతీ ఒక్కరు ఓటు వేయాలి
జెండా ఊపి ర్యాలీని ప్రారంభిస్తున్న కలెక్టర్‌ శ్రీహర్ష

- కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

- నారాయణపేటలో అవగాహన ర్యాలీ

నారాయణపేటటౌన్‌, ఏప్రిల్‌ 19: ప్రజాస్వామ్యం లో ఓటు వజ్రాయుధం లాంటిదని, ఓటు హక్కు క లిగిన ప్రతీ ఒక్కరు ఓటు వేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో ని కలెక్టరేట్‌ ఆవరణలో స్వీప్‌ కార్యక్రమంలో భాగం గా శుక్రవారం ఏర్పాటు చేసిన ఓటరు అవగాహన ర్యాలీని కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. కలెక్ట రేట్‌ నుంచి కళా బృందం ఆలపించిన ఓటరు చైత న్య గీతాల మధ్య ర్యాలీ కొనసాగింది. శాసన్‌పల్లి రో డ్డు, మునిసిపల్‌ పార్కు, టీచర్స్‌ కాలనీ, నాగుల కట్ట వరకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆర్డీవో మ ధుసూదన్‌ మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతీ ఒక్కరు స్వేచ్ఛాయుత వాతా వరణంలో వినియోగించుకోవాలన్నారు. ఏలాంటి ప్రలోభాలకు లొంగకుండా సమర్థులైన నాయకుల ను ఎన్నుకునేందుకు ఓటు వేయాలని కోరారు. స్వీప్‌ కార్యక్రమ నోడల్‌ అధికారి, జడ్పీ ఇన్‌చార్జి సీ ఈవో జ్యోతి మాట్లాడుతూ ఓటు హక్కు వినియోగంలో యువత, మహిళలు ముందుం డా లని సూచించారు. ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో ఓటర్లు డబ్బు, మద్యం, ఇతర ఏలాంటి ప్రలోభాల కు లోంగకుండా నిర్భయంగా ఓటు హక్కు విని యోగించుకోవాలని కోరారు. అనంతరం ప్రతీ ఒక్క రు తప్పని సరిగా తమ ఓటు హక్కును వినియో గించుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో స్థానిక మునిసిపల్‌ కమిషనర్‌ సునీత, తహసీల్దార్‌ రాణా ప్రతాప్‌, డీటీ నారాయణ, తహసీల్దార్‌ కార్యా లయ సిబ్బంది, మునిసిపల్‌ కార్యాలయ అధికారు లు, ఉద్యోగులు, మహిళా సంఘాల ఆర్పీలు, చిట్టెం నర్సిరెడ్డి, మెమోరియల్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

జిల్లాలో సమ్మర్‌ క్యాంపులు ఏర్పాటు చేయాలి

వేసవి సెలవుల్లో పదో తరగతి విద్యార్థులకు సమ్మర్‌ క్యాంపులు నిర్వహించేందుకు కార్యాచరణ ను రూపొందించాలని కలెక్టర్‌ శ్రీహర్ష జిల్లా విద్యా శాఖ అధికారి అబ్దుల్‌ ఘనీకి సూచించారు. శుక్ర వారం కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో విద్యాశాఖ అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహిం చారు. ఈ సందర్భంగా వేసవి సెలవులు 45 రోజుల పాటు జిల్లాలోని నారాయణపేట, మక్తల్‌, కోస్గి, పట్టణాలలో పదో తరగతి విద్యార్థులకు ప్రేరణ తరగతులను నిర్వహించాలని, ప్రతీ ప్రభుత్వ పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థుల చొప్పున ఎంపిక చేయాలన్నారు. ఈ ప్రేరణ తరగతులకు రోజూ పంపించేలా ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు విద్యార్థుల తల్లిదండ్రులను సంప్రదించి అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రేరణ తరగతులు నిర్వ హించే ప్రాంతాలలో స్థానికంగా ఉన్న గణితం, సా మాన్య శాస్త్ర ఉపాధ్యాయులు, విద్యార్థులకు పాఠా లు బోధించాల్సి ఉంటుందని కలెక్టర్‌ తెలిపారు. ప్రతీ సంవత్సరం డిసెంబర్‌లో నిర్వహించే ప్రేరణ తరగతుల మాదిరిగా ఈ సారి ముందస్తుగా నిర్వ హించాలని కలెక్టర్‌ సూచించారు. సమావేశంలో వి ద్యాశాఖ అధికారులు చంద్రకాంత్‌, శ్రీని వాస్‌సాగర్‌, నాగార్జునరెడ్డి, రమేష్‌, రవికుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 11:22 PM