Share News

ప్రతి ఒక్కరికీ ధ్యానం అవసరం

ABN , Publish Date - Mar 06 , 2024 | 11:39 PM

ప్రతి ఒక్కరికీ ధ్యానం అవసరమని, కర్ణాటక రాష్ట్రంలో విద్యార్థులకు ధాన్యం నేర్పించడం జరుగుతుందని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ అన్నారు.

ప్రతి ఒక్కరికీ ధ్యానం అవసరం
కార్యక్రమంలో మాట్లాడుతున్న స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌

స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌

వికారాబాద్‌, మార్చి6: ప్రతి ఒక్కరికీ ధ్యానం అవసరమని, కర్ణాటక రాష్ట్రంలో విద్యార్థులకు ధాన్యం నేర్పించడం జరుగుతుందని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ అన్నారు. బుధవారం ఈశ్వరీయ బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా వికారాబాద్‌లో దాద్వశ జ్యోతిర్లింగ రథయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. తెలంగాణలో కూడా పాఠశాలల్లో విద్యార్థులకు ధ్యానం నేర్పించే విధంగా సీఎం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక అలవర్చుకొని ప్రశాంతమైన జీవితం గడుపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, చైర్‌పర్సన్‌ మంజుల, నాయకులు ఎర్రవల్లి జాఫర్‌, మహిపాల్‌రెడ్డి, కిషన్‌ నాయక్‌, ముత్తహార్‌ షరీప్‌, గోపాల్‌, బ్రహ్మకుమారి మధు అక్కయ్య, నిర్వాహకులు నాయకులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. అంతే కాకుండా వికారాబాద్‌ పట్టణంలోని కొత్తగడి సమీపంలో 27వ వార్డు కౌన్సిలర్‌ సురేష్‌ తనయులు రాకేష్‌, రాహుల్‌ నూతనంగా ఏర్పాటు చేసిన స్పోర్ట్స్‌ జోన్‌ను స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2024 | 11:39 PM