Share News

ప్రతీ దరఖాస్తును ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి

ABN , Publish Date - Jan 05 , 2024 | 11:20 PM

ప్రజాపాలన ద్వారా స్వీకరించిన ప్రతీ దరఖాస్తును ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కలెక్టర్‌ జి. రవినాయక్‌ స్పష్టం చేశారు.

ప్రతీ దరఖాస్తును ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రవినాయక్‌

- డేటా ఎంట్రీ ఆపరేటర్ల శిక్షణలో కలెక్టర్‌ రవి నాయక్‌

మహబూబ్‌నగర్‌ (కలెక్టరేట్‌), జనవరి 5 : ప్రజాపాలన ద్వారా స్వీకరించిన ప్రతీ దరఖాస్తును ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కలెక్టర్‌ జి. రవినాయక్‌ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంట్రీ కోసం నియమించబడిన ఆపరేటర్లకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమానికి కలెక్టర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన కార్యక్రమం దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నట్లు చెప్పారు. తప్పుల్లేకుండా డేటా నమోదు చేయాలని ఆపరేటర్లకు సూచించారు. అవసరమైన కంప్యూటర్లు, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. డేటా ఎంటర్‌ చేసేందుకు 46 బృందాలను ఏర్పాటు చేశామని, ఒక్కో బృందానికి ఒక్కో లాగిన్‌ ఇస్తారని వివరించారు. స్థానికి సంస్థల అదనపు కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ ఎస్‌.మోహన్‌ రావు, ఆర్డీవో అనిల్‌ కుమార్‌, ఈ-జిల్లా మేనేజర్‌ చంద్రశేఖర్‌ ఉన్నారు.

Updated Date - Jan 05 , 2024 | 11:20 PM