Share News

ప్రతి దరఖాస్తునూ ఆన్‌లైన్‌ చేయాలి

ABN , Publish Date - Jan 07 , 2024 | 12:15 AM

ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి దరఖాస్తునూ ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేయాలని జడ్పీ సీఈవో సురేష్‌కుమార్‌ ఆదేశించారు.

ప్రతి దరఖాస్తునూ ఆన్‌లైన్‌ చేయాలి
Every application should be made online

సూర్యాపేటలో డేటా ఎంట్రీని పరిశీలిస్తున్న జడ్పీ సీఈవో సురేష్‌కుమార్‌

సూర్యాపేటరూరల్‌, జనవరి 6: ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి దరఖాస్తునూ ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేయాలని జడ్పీ సీఈవో సురేష్‌కుమార్‌ ఆదేశించారు. సూర్యాపేట మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో దరఖాస్తుల అన్‌లైన్‌ ప్రక్రియను శనివారం ఆయన పరిశీలించారు. సూర్యాపేట మండలంలో 12,477 దరఖాస్తులు స్వీకరిం చినట్లు తెలిపారు. ఆయన వెంట ఎంపీడీవో శ్రీనివాస్‌రావు ఉన్నారు.

మోతె: ప్రతి దరఖాస్తును ఆన్‌లైన్‌ చేయాలని కోదాడ నియోజకవర్గ ప్రత్యేకాధికారి గూడ వెంకటేశ్వర్లు అన్నారు. మండల పరిధిలోని సిరికొం డలో ప్రజాపాలన కార్యక్రమాన్ని పరిశీలించారు. దరకాస్తులు గ్రామంలో ఇవ్వలేని వారు మండలకేంద్రంలో అధికారులకు అందజేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ నూకల సావిత్రమ్మ పాల్గొన్నారు.

తిరుమలగిరి: మునిసిపాలిటీ పరిధిలో 6,190, మండలంలో 9,561 మంది దరఖాస్తులు చేసుకున్నట్లు మునిసిపల్‌, మండలం పరిషత్‌ అదికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ దండు శ్రీను, ఎంపీడీవో కె. ఉమేష్‌చారి తదితరులు పాల్గొన్నారు.

మద్దిరాల: ప్రజాపాలన దరఖాస్తులను డేటా ఎంట్రీ చేయాలని పీడీ కిరణ్‌కుమార్‌, తహసీల్దార్‌ అమీన్‌సింగ్‌ అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో డేటా ఎంట్రీని పరిశీలించారు. మండలంలో 10,612 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో సరోజ, ఎంపీవో రాజేష్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ రామారావు, ఆర్‌ఐ వహిదోద్దీన్‌ పాల్గొన్నారు.

చిలుకూరు: ప్రజాపాలన దరఖాస్తుల ఆన్‌లైన్‌ ఎంట్రీ కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నామని మండల ప్రత్యేకాధికారి, జిల్లా మత్స్యశాఖ అధికారి రూపేందర్‌సింగ్‌ అన్నారు. దరఖాస్తుల ఆన్‌లైన్‌ ఎంట్రీ కార్యక్రమాన్ని పరిశీలించారు. దరఖాస్తులను ఈ నెల 17వ తేదీలోగా ఆన్‌లైన్‌ ఎంట్రీ పూర్తి చేస్తామని తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్‌ సరిత, ఎంపీడీవో ఈదయ్య, వీఆర్‌ఏఈ లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు.

హుజూర్‌నగర్‌: అధికారులు అంకితభావంతో పనిచేసినప్పుడు ప్రజ ల్లో గుర్తింపు ఉంటుందని మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసరెడ్డి అన్నా రు. శనివారం పట్టణంలోని కమిషనర్‌ శ్రీనివాసరెడ్డిని అదే విధంగా 8,9, 11, 14, 25వ వార్డుల్లో ప్రజాపాలన అధికారులకు పలు పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు సన్మానించారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ కస్తాల శ్రావణ్‌, గల్లా వెంకటేశ్వర్లు, కోలపూడి యోహాన్‌, సులువ చంద్రశేఖర్‌,అన్నపూర్ణ, ముత్యాలు, హేమలత,చంద్రకళ,రేణుక, త్రివేణి,సైదులు,అశోక్‌,వెంకటేష్‌, బొల్లెద్దు ధనమ్మజైలు, తదితరులు పాల్గొన్నారు. మండలంలోని వేపలసింగారంలో సర్పంచ్‌ అన్నెం శిరీషకొండారెడ్డి దరఖాస్తులు స్వీకరించారు.

నేరేడుచర్ల: దరఖాస్తులను తప్పులు లేకుండా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని హుజూర్‌నగర్‌ ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. నేరేడుచర్ల మున్సిపాలిటీలో కొనసాగుతున్న దరఖాస్తులు ఆన్‌లైన్‌ డాటా ఎంట్రీని పరిశీలించారు. ఒక్క దరఖాస్తు కూడా మిస్‌ కాకుండా వచ్చిన దరఖాస్తును ఎంట్రీ చేయాలన్నారు. ఆయన వెంట మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లు, మేనేజర్‌ అశోక్‌రెడ్డి, చైర్మన్‌ జయబాబు, నాగయ్య, ప్రకాష్‌; సులోచన, ట్రాన్స్‌కో ఏఈ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

పెన్‌పహాడ్‌: బంజారహిల్స్‌తండాలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో ఎంపీడీవో బాణాల శ్రీనివాస్‌, తహసీల్దార్‌ మహేందర్‌రెడ్డి దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో మండల అధికారులు అనూష, అజయ్‌నాయక్‌, రవి, కృష్ణ సందీప్‌, సర్పంచ్‌ భిక్షంనాయక్‌, రవీందర్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

మఠంపల్లి: అర్హులైన పేదలందరికీ పథఽకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజాపాలన మండల ప్రత్యేకాధికారి ఏడీఏ సంధ్యారాణి అన్నారు. శనివారం దరఖాస్తులు స్వీకరించినట్లు తహసీల్దార్‌ మంగా రాథోడ్‌, ఎంపీడీవో జనకిరాములు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ప్రభుదాసు, గాదె జయభారత్‌రెడ్డి, బుడిగ హుస్సేన్‌గౌడ్‌,రవి, శౌరి, మలికంటి బుచ్చయ్య, మహేష్‌గౌడ్‌, తవడబోయిన నాగేశ్వరావు, జోసు, జానీపాషా, దగ్గుపాటి మహేష్‌, నందిపాటి రవి తదితరులు పాల్గొన్నారు.

కోదాడ రూరల్‌: మండలంలో 16,838 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ వచ్చిన దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నామని ఎంపీడీవో విజయశ్రీ తెలిపారు.

హుజూర్‌నగర్‌: హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఆరుగ్యారెంటీల పథకాలకు ప్రజలు పెద్దఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. అందులో నియోజకవర్గం మొత్తంలో 1,00,368 మంది ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్నారు. ఐదు గ్యారెంటీలకు నియోజకవర్గం మొత్తంలో 15,753 దరఖాస్తులు వచ్చాయి. హుజూర్‌నగర్‌ మున్సిపాలిటి పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు 11,368, నేరేడుచర్ల మున్సిపాలిటిలో 3854, చింతలపాలెం 11,710, గరిడేపల్లి 19,228, హుజూర్‌నగర్‌ 8941, మఠంపల్లి 14,065, మేళ్లచెర్వు 13,060, నేరేడుచర్ల 8983, పాలకవీడు 9,159 దరఖాస్తులు వచ్చాయి. ఏడు మండలాల్లో ఐదు గ్యారెంటీలకు 14,230 దరఖాస్తులు రాగా, ఇందిరమ్మ ఇళ్ల కోసం ఏడు మండలాల్లో 85,146 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం ఐదు గ్యారెంటీలు, ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు కలిపి మొత్తం 1,16,101 దరఖాస్తులు వచ్చాయి.

Updated Date - Jan 07 , 2024 | 12:15 AM