Share News

తెలంగాణ పర్యావరణ ప్రభావ అంచనా అథారిటీ ఏర్పాటు

ABN , Publish Date - Mar 12 , 2024 | 03:52 AM

పర్యావరణ సమస్యలను అంచనా వేసి తగు నిర్ణయాలు తీసుకునేందుకు తెలంగాణ పర్యావరణ ప్రభావ అంచనా అథారిటీ త్రిసభ్య కమిటీని కేంద్రం నియమించింది. కమిటీ ఛైర్మన్‌గా

తెలంగాణ పర్యావరణ ప్రభావ అంచనా అథారిటీ ఏర్పాటు

సూచనలు ఇచ్చేందుకు 15 మంది నిపుణుల కమిటీ

హైదరాబాద్‌, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): పర్యావరణ సమస్యలను అంచనా వేసి తగు నిర్ణయాలు తీసుకునేందుకు తెలంగాణ పర్యావరణ ప్రభావ అంచనా అథారిటీ త్రిసభ్య కమిటీని కేంద్రం నియమించింది. కమిటీ ఛైర్మన్‌గా గౌరవరం సబిత, సభ్యుడిగా రిటైర్డ్‌ ఐఎ్‌ఫఎస్‌ అధికారి స్వర్గం శ్రీనివాస్‌, సభ్య కార్యదర్శిగా రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ ప్రత్యేక కార్యదర్శిని నియమిస్తూ కేంద్రం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ కమిటీకి సూచనలు, సలహాలు అందించేందుకు 15 మంది సభ్యులతో కూడిన రాష్ట్రస్థాయి నిపుణుల అంచనా కమిటీని కూడా కేంద్రం ప్రకటించింది. దీనికి ఛైర్మన్‌గా ఎం.గోపాల్‌ రెడ్డిని నియమించారు.

Updated Date - Mar 12 , 2024 | 03:52 AM