Share News

భక్తిశ్రద్ధలతో ఎరుకల నాంచారమ్మ జాతర

ABN , Publish Date - May 24 , 2024 | 12:27 AM

తెలుగు రాష్ట్రాల్లోని ఏకైక దేవాలయమైన ఎరుకల నాంచారమ్మ జాతరను యాదాద్రి-భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం పిలాయిపల్లిలోని నాంచారమ్మ దేవాలయంలో గురువారం తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది.

భక్తిశ్రద్ధలతో ఎరుకల నాంచారమ్మ జాతర
పూజల్లో పాల్గొన్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి

భూదాన్‌పోచంపల్లి, మే 23: తెలుగు రాష్ట్రాల్లోని ఏకైక దేవాలయమైన ఎరుకల నాంచారమ్మ జాతరను యాదాద్రి-భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం పిలాయిపల్లిలోని నాంచారమ్మ దేవాలయంలో గురువారం తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఉత్సవాలకు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లోని అతి ప్రసిద్ధి గాంచిన ఎరుకల నాంచారమ్మ జాతరను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా లాంఛనంగా నిర్వహిస్తోందన్నారు. కుల, మతాలకతీతంగా అందరూ అమ్మవారి జాతరను ఘనంగా జరుపుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ బందారపు సుమలత లక్ష్మణ్‌గౌడ్‌, మాజీ సర్పంచు అందెల హరీ్‌షయాదవ్‌, డీసీసీ ఉపాధ్యక్షుడు కళ్లెం రాఘవరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ అందెల లింగంయాదవ్‌, నాయకులు సామ మధుసూదన్‌రెడ్డి, పాక మల్లే్‌షయాదవ్‌, భారత లవకుమార్‌, మర్రి నర్సింహారెడ్డి, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ సామ మోహన్‌రెడ్డి, గోరంటి శ్రీనివా్‌సరెడ్డి, అంబరీ్‌షరెడ్డి, పక్కీరు నర్సిరెడ్డి, తోట శ్రీనివాస్‌, తోట బాబు, కుతాడి రాములు, కుతాడి సురేష్‌ తదితరులున్నారు. అదేవిధంగా నాంచారమ్మ జాతరలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తహసీల్దారు శ్రీకాంత్‌రెడ్డి, ఆర్‌ఐ వెంకట్‌రెడ్డి, ఎంపీడీవో భాస్కర్‌, ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి ఆద్వర్యంలో ప్రత్యేక పర్యవేక్షణ నిర్వహించారు. సాయంత్రం వేళ పోతరాజుల విన్యాసాలతో డప్పులు, వాయిద్యాల నడుమ విచిత్ర వేషధారణలో అలరించగా మహిళా భక్తులు బోనాలతో ఊరేగింపు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు.

Updated Date - May 24 , 2024 | 12:27 AM