పోలియో మహమ్మారిని తరమికొట్టాలి
ABN , Publish Date - Mar 03 , 2024 | 11:30 PM
జోగుళాంబ గద్వాల జిల్లాను పోలియో రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్ శశికళ అ న్నారు.
- డీఎంహెచ్‌వో డాక్టర్ శశికళ
- జిల్లాలో 71,099 మంది చిన్నారులకు పోలియో చుక్కలు
గద్వాల న్యూటౌన్, మార్చి 3 : జోగుళాంబ గద్వాల జిల్లాను పోలియో రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్ శశికళ అ న్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జమ్మిచేడులోని అంగన్‌వాడీ కేంద్రంలో డీఎంహెచ్‌వో చిన్నారు లకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 0-5 సంవత్సరాల పిల్లలు 73,870 మంది ఉన్నారన్నారు. వీరందరికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించే లా చూడాల్సిన బాధ్యత అందిరిపై ఉందన్నారు. ము ఖ్యంగా వైద్యసిబ్బంది అందరు హైరిస్క్ ప్రాంతాలను సందర్శించి అక్కడ ఉన్నటువంటి పిల్లలకు పోలియో చుక్కలు వేయాలన్నారు. ఆదివారం మొదటి రోజు బూ త్ ఆక్డీవిటి పల్స్ పోలియో కార్యక్రమంలో 71,099 (96.25 శాతం) మంది చిన్నారులకు చుక్కలు వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ సిద్దప్ప, ప్రోగ్రాం అధికారి స్రవంతి, వైద్యసిబ్బంది మధుసూదన్‌రెడ్డి, నరేంద్రబాబు, తిరుమలేష్‌రెడ్డి, వరలక్ష్మి, రవిచందర్ తదితరులున్నారు.