Share News

Manchiryāla- పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

ABN , Publish Date - Jun 05 , 2024 | 10:33 PM

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని బెల్లంపల్లి ఎఫ్‌డీవో విజయ్‌కుమార్‌ అన్నారు. బుధవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అటవీ శాఖ ఆధ్వర్యంలో బుగ్గ దేవాలయం సమీపంలో స్ధానికులకు, భక్తులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.

Manchiryāla-  పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
బుగ్గ దేవాలయంలో ప్లాస్టిక్‌ వ్యర్ధాలను సేకరిస్తున్న అటవీ అధికారులు

కాసిపేట, జూన్‌ 5 :పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని బెల్లంపల్లి ఎఫ్‌డీవో విజయ్‌కుమార్‌ అన్నారు. బుధవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అటవీ శాఖ ఆధ్వర్యంలో బుగ్గ దేవాలయం సమీపంలో స్ధానికులకు, భక్తులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించడంలో ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయని, మన దేశంలో కూడా ప్లాస్టిక్‌ రహిత సమాజ నిర్మాణంలో అందరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్లాస్టిక్‌ వ్యర్ధాలను జమ చేసి డంపింగ్‌యార్డుకు తరలించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఆర్‌వో సుభాష్‌, డిప్యూటి ఆర్‌వో ఆంజనేయులు, తిరుపతి, సతీష్‌, గౌరిశంకర్‌, ప్రవీణ్‌నాయక్‌, ఎఫ్‌ఎస్‌వోలు ప్రభాకర్‌రావు, శ్రీనివాస్‌, ఎఫ్‌బీవోలు పాల్గొన్నారు. కాగా దేవాపూర్‌ ఓరియంట్‌ సిమెంట్‌ కంపెనీ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా సల్లపవాగు సమీపంలో అధికారులు మొక్కలు నాటారు. కంపెనీ ప్రెసిడెంట్‌ సత్యభ్రత్‌ శర్మ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. కార్యక్రమంలో కంపెనీ యూనిట్‌ హెడ్‌ మహేంద్ర ప్రతాప్‌ జోషి, హెచ్‌ఆర్‌ జీఎం ఆనంద్‌కులకర్ణి, కార్మికులు పాల్గొన్నారు.

జైపూర్‌: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ కాగజ్‌నగర్‌ డివిజనల్‌ మేనేజర్‌ శ్రావణి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుందారం గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో వైద్యాధికారిణి శ్రావ్యతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో మంచిర్యాల రేంజ్‌ ప్లాంటేషన్‌ మేనేజర్‌లు గోగు సురేష్‌కుమార్‌, లక్ష్మణ్‌, డిప్యూటి ప్లాంటేషన్‌ మేనేజర్‌లు రాకేష్‌,నరేష్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ రవికుమార్‌,బీట్‌ ఆఫీసర్‌ రవీందర్‌, ఫీల్డ్‌ సూపర్‌ వైజర్‌ శ్రీనివాస్‌, రాజేష్‌, తిరుపతి, వాచర్‌లు శంకర్‌, లచ్చన్న, రాకేష్‌, వైద్య సిబ్బంది జయమణి, జయమ్మ, గంగయ్య, అఖిల్‌ తదితరులు పాల్గొన్నారు.

దండేపల్లి: పర్యావరణ పరిరక్షణ అఽందరి బాధ్యత అని జిల్లా గ్రామీణా అభివృద్ధి శాఖ అధికారి కిషన్‌ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవంను పురష్కరించుకోని దండేపల్లి మండలం కన్నెపల్లిలో ఉపాధిహామీ కూలీలు పని చేసే ప్రదేశానికి వెళ్లి వారితో కలిసి పలుచోట్ల మొక్కలు నాటించి, ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రసాద్‌, ఎంపీవో శ్రీనివాస్‌, ఈజీఎస్‌ ఏపీవో దుర్గదాస్‌, ఈసీ భీమయ్య, టీఏ జగన్‌, ఉపాధి కూలీలు, ఈజీఎస్‌ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. కాగా తాళ్ళపేట అటవీ రెంజ్‌ కార్యాలయ ఆవరణలో తాళ్ళపేట అటవీ రెంజ్‌ అధికారి (ఎఫ్‌ఆర్వో) సుష్మ మొక్కలు నాటారు. అనంతరం తాళ్లపేట బస్టాండ్‌ వారసం తలో ప్రజలకు పర్యావరణపరిరక్షణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కంది హేమలత-సతీష్‌, డిప్యూటీ రెంజ్‌ అధికారులు ప్రమోద్‌ కుమార్‌, పోచమల్లు, ఎఫ్‌ఎస్‌వోలు, ఎఫ్‌బీవోలు, ప్రజలు, సిబ్బంది పాల్గొన్నారు.

భీమారం: మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో రాథోడ్‌ రాధ మొక్కలు నాటారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి చిన్నయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

వేమనపల్లి: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం వేమనపల్లి మండల పరిషత్‌ కార్యాలయంలో అధికారులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో సీనియర్‌ అసిస్టెంట్‌లు లక్ష్మీనారాయణ, శ్యాంచంద్‌, పంచాయతీ కార్యదర్శి పోశం, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 05 , 2024 | 10:33 PM