Share News

విద్యుత్‌ మీటర్‌ రీడింగ్‌ కార్మికులకు ఉపాధి కల్పించాలి

ABN , Publish Date - Feb 07 , 2024 | 11:17 PM

విద్యుత్‌ సంస్థలో 23 ఏళ్లుగా మీటర్‌ రీడింగ్‌ విధులు నిర్వహిస్తున్న కార్మికులకు 30రోజుల పనిదినాలు కల్పించాలని విద్యుత్‌ సంస్థ అధికారులను కోరారు.

విద్యుత్‌ మీటర్‌ రీడింగ్‌ కార్మికులకు ఉపాధి కల్పించాలి
డైరెక్టర్‌ రాములుకు వినతిపత్రం అందజేస్తున్న కార్మికులు

పాలమూరు, ఫిబ్రవరి 7 : విద్యుత్‌ సంస్థలో 23 ఏళ్లుగా మీటర్‌ రీడింగ్‌ విధులు నిర్వహిస్తున్న కార్మికులకు 30రోజుల పనిదినాలు కల్పించాలని విద్యుత్‌ సంస్థ అధికారులను కోరారు. బుధవారం జిల్లా కేంద్రంలోని విద్యుత్‌ భవన్‌కు ఆడిట్‌ డైరెక్టర్‌ రాములు తనిఖీ చేసేందుకు వచ్చారు. కాంట్రాక్టు విద్యుత్‌ మీటర్‌ రీడింగ్‌ కార్మికులు ఆయనను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. విద్యుత్‌ సంస్థలోనే 23ఏళ్లుగా పనిచేస్తున్నప్పటికీ చాలీచాలని ఫీజువర్కుగా కాంట్రాక్టర్‌ ఇస్తున్నట్లు తెలిపారు. విద్యుత్‌ శాఖ యాజమాన్యం తమను గుర్తించటంలేద న్నారు. రీడింగ్‌ కార్మికులకు కనెక్షన్‌కు రూ.2లు పెంచుతున్న కాంట్రాక్టర్‌ చెబు తున్నారని చెప్పారు. మొబైల్‌ నెంబర్‌లింకు, ఆధార్‌నెంబర్‌, స్ట్రచర్‌కోడ్‌, రేషన్‌ కార్డు నెంబర్‌ లింక్‌ చేసే పనివల్ల ఎక్కువ పనిభారం తమపై పడుతోందన్నా రు. తమకు నెలలో 30రోజుల పాటు ఉపాధికల్పించి ఆదుకోవాలన్నారు. మహ బూబ్‌గనర్‌ జిల్లా విద్యుత్‌ మీటర్‌ రీడింగ్‌ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వర్త పాండురంగ, ప్రకాష్‌, రంగయ్య, బాలుగౌడ్‌, శరత్‌కుమార్‌, కె.ప్రకాష్‌, రంగన్న, రామలింగం, హన్మంతు, ప్రవీణ్‌, శేఖర్‌రెడ్డి, నరేష్‌యాదవ్‌, జగన్‌, రవి, వెంకటేష్‌, భాస్కర్‌, ప్రశాంత్‌, రాజుగౌడ్‌, రవి, కల్యాణ్‌, ఎం.డి. బురానుద్దీన్‌, రాజు, చెన్నయ్య పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2024 | 11:17 PM