Share News

Kumaram Bheem Asifabad- ఎన్నికల నిబంధనలు పాటించాలి

ABN , Publish Date - Apr 16 , 2024 | 10:53 PM

జిల్లాలో లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో మంగళవారం ఎస్పీ సురేష్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ దాసరి వేణులతో కలిసి ఎన్నికల విభాగం అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో పార్లమెంట్‌ ఎన్నికల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

Kumaram Bheem Asifabad-    ఎన్నికల నిబంధనలు పాటించాలి
: మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 16: జిల్లాలో లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో మంగళవారం ఎస్పీ సురేష్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ దాసరి వేణులతో కలిసి ఎన్నికల విభాగం అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో పార్లమెంట్‌ ఎన్నికల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలు ఎలాంటి అవాంతరాలు, ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా నిర్వహించేలా రాజకీయ పార్టీలు సహకారం అందించాలని కోరారు. ఈ నెల 18న ఎన్నికల గెజిట్‌ విడుదలై, నామినేషన్లు పరిశీలన, ఉపసంహరణ, అభ్యంతరాల స్వీకరణ, తుది జాబితా విడుదల ప్రక్రియ అనంతరం మే 13వ తేదీన పోలింగ్‌, జూన్‌ 4న కౌంటింగ్‌ జరుగుతాయని వివరించారు. జూన్‌ 6 వరకు ప్రవర్తన నియమావళి అమలులో ఉంటుందని తెలిపారు. రాజకీయ పార్టీలు, ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థులు, ఎన్నికల ప్రవర్తన నియమావళిని కచ్చితంగా పాటించాలన్నారు. ఉల్లంఘనలకు పాల్పడితే భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు చర్యలు ఉంటాయని తెలిపారు.ఈ నెల 19న జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాంల వద్ద గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం ర్యాండమైజేషన్‌ నిర్వహించనున్నామని తెలిపారు. కేటాయింపు, అనంతరం ఆసిఫాబాద్‌ నియోజక వర్గానికి సంబంధించి జిల్లా కేంద్రంలోని పీటీజీ పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూంకు బందో బస్తులో ఎలకా్ట్రనిక్‌ ఓటింగ్‌ యంత్రాలను తరలించి భద్రపరుస్తామని తెలిపారు. ఈ నెల 15వ తేదీ వరకు నూతన ఓటరు నమోదు కోసం అందిన దరఖాస్తులను పరిశీలిస్తామని చెప్పారు. నిబంధనల మేరకు అర్హత గల వారికి పార్లమెంట్‌ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఫారం 12 ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియపై సమాచారం, ఫిర్యాదు చేసేందుకు కలెక్టర్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశామన్నారు. సీ-విజిల్‌ ద్వారా వచ్చే ఫిర్యాదులను నిర్ణీత సమయంలోగా పరిష్కరిస్తామని తెలిపారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల ప్రచారంతో భాగంగా ప్రకటనలు, సభ, ర్యాలీలు, సమావేశాల కోసం 48 గంటలు ముందుగా సువిధ యాప్‌ ద్వారా దరఖాస్తు చేసుకుకోవాలన్నారు. ఎన్నికల నిబంధనల మేరకు అనుమతులు జారీ చేస్తామని తెలిపారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి లోకేశ్వర్‌రావు, ఆసిఫాబాద్‌ డీఎస్పీ సదయ్య, అధికారులు, రాజకీయ పాఆర్టీల ప్రతినిదులు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 10:53 PM