Share News

ఎన్నికల విధులు సక్రమంగా నిర్వహించాలి

ABN , Publish Date - Mar 22 , 2024 | 12:28 AM

ఎన్నికల విధుల నిర్వహణలో సక్రమంగా నిర్వర్తించాలని సహాయ రిట్నరింగ్‌ అధికారి, ఆర్డీవో శ్రీనివాసరావు సూచించారు.

ఎన్నికల విధులు సక్రమంగా నిర్వహించాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఆర్డీవో శ్రీనివాసరావు

మిర్యాలగూడ, మార్చి 21: ఎన్నికల విధుల నిర్వహణలో సక్రమంగా నిర్వర్తించాలని సహాయ రిట్నరింగ్‌ అధికారి, ఆర్డీవో శ్రీనివాసరావు సూచించారు. స్థానిక ఏఆర్సీ ఫక్షన్‌హల్‌లో నియోజకవర్గపరిధిలోని మిర్యాలగూడ, దామరచర్ల, మాడుగులపల్లి, వేములపల్లి, అడవిదేవులపల్లి మండలాల 264పోలింగ్‌ కేంద్రాల బూత్‌స్థాయి అధికారులతో గురువారం జరగిన సమావేశంలో మాట్లాడారు. 85 వయసుపై బడిన వయోవృద్ధుల జాబితాను అనుసరించి ఫారం 12డీ దరకాస్తులు జారీ చేయాలన్నారు. సంబందిత ఓటర్లకు పంపిణీ చేసిన తరువాత పోస్టల్‌ బ్యాలెట్‌ దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. నియోజకవర్గంలో ఐదు బృందాలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పర్యవేక్షిస్తాయన్నారు. తనిఖీల్లో పట్టుబడిన నగదు, బంగారం మరుసటి రోజు ఉదయం 9 గంటలకు జిల్లా అధికారులకు అప్పగించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మిర్యాలగూడ సెగ్మెంట్‌కు సంబంధించిన 30 రూట్‌ల అధికారులు, తహసీల్దార్లు, సీనియర్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

Updated Date - Mar 22 , 2024 | 12:28 AM