Share News

టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి

ABN , Publish Date - Jun 08 , 2024 | 11:57 PM

ఉపాధ్యాయుల స మస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని, అనేక రకా ల ఉపాధ్యాయ సమస్య లపై ప్రభుత్వానికి అవగాహన ఉందని, హామీలు నె రవేరుస్తుందని టీపీఆర్టీ యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్‌ అన్నారు.

 టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి
సమావేశంలో మాట్లాడుతున్న భిక్షంగౌడ్‌

టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి

నల్లగొండటౌన, జూ న 8: ఉపాధ్యాయుల స మస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని, అనేక రకా ల ఉపాధ్యాయ సమస్య లపై ప్రభుత్వానికి అవగాహన ఉందని, హామీలు నె రవేరుస్తుందని టీపీఆర్టీ యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నో సంవత్సరాలుగా ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్న పదోన్నతులు, బదిలీలకు సంబంధించిన ప్రక్రియను ప్రభుత్వం కొనసాగించడం, షెడ్యూల్‌ రిలీజ్‌ చేయడంపై ప్రభుత్వానికి టీపీఆర్టీయూశాఖ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. పెండింగ్‌ ఉన్న డీఏలు పలు రకాల పెండింగ్‌ బిల్లులు రెండు, మూడేళ్లుగా రాక టీచర్లు ఎ దురుచూస్తున్నారని అన్నారు. మిగతా సమస్యలు సైతం ప్రభుత్వం త్వరలో పరిష్కరించాలని కోరారు. సమావేశంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మం కెన రాంచంద్రారెడ్డి, బత్తిని భాస్కర్‌ గౌడ్‌, రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు చనగోని యాదయ్య, నాయకులు అద్దంకి సునీల్‌, రెబల్లి శరత, కేశపోయిన గోపాల్‌, పొదిలి యాదగిరి, సముద్రాల నారాయణ, మిర్యాల మురళి పాల్గొన్నారు.

Updated Date - Jun 08 , 2024 | 11:57 PM