ప్రైవేటు జూనియర్, డిగ్రీ కాలేజీల సమస్యల పరిష్కారానికి కృషి: శ్రీధర్‌బాబు
ABN , Publish Date - Apr 03 , 2024 | 02:38 AM
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్, డిగ్రీ కాలేజీల సమస్యలపై మ్యానిఫెస్టో కమిటీలో చర్చించి ప్రభుత్వ పరంగా పరిష్కారం

హైదరాబాద్, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్, డిగ్రీ కాలేజీల సమస్యలపై మ్యానిఫెస్టో కమిటీలో చర్చించి ప్రభుత్వ పరంగా పరిష్కారం కోసం కృషి చేస్తానని మంత్రి, మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్‌బాబు భరోసానిచ్చారు. గాంధీభవన్‌లో మంగళవారం టీపీజేఎంఏ, టీపీడీఎంఏ ప్రతినిధులు మ్యానిఫెస్టో కమిటీతో భేటీ అయి ప్రైవేటు జూనియర్, డిగ్రీ కాలేజీల సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. సమస్యలను ప్రభుత్వం కూలంకషంగా పరిశీలిస్తుందని, సమస్య పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని అన్నారు.