Share News

మద్దిమడుగులో సమస్యల పరిష్కారానికి కృషి

ABN , Publish Date - Oct 26 , 2024 | 11:26 PM

మద్దిమడుగులో సమస్యల పరిష్కారానికి కృషిEfforts to solve problems in Maddimadugu

మద్దిమడుగులో సమస్యల పరిష్కారానికి కృషి
మాలధారణ పోస్టర్‌ విడుదల చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

- మాలధారణ వాల్‌పోస్టర్‌ విడుదల చేసిన ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

అచ్చంపేటటౌన్‌, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి) : మద్దిమడుగు బ్రహ్మో త్సవాలు, మాలధారణ వాల్‌ పోస్టర్‌ను మద్దిమడుగు పీఠాధిపతి కేతావత్‌ జ యరాం, గురుస్వామి డాక్టర్‌ హనుమం తు, గురుస్వామి శ్రీను, సండ్రగడ్డ జయరాంలతో కలిసి శనివారం ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ ని వాసంలో విడుదల చేశారు. మద్దిమడుగు క్షేత్రం లో మార్గశిర మాసం పాఢ్యమి పార్ణమి రోజున మహాభిషేకం, 2,0054వేల తమలపాకులు, 200 54 సకల పుష్పాలు, పుషార్చన భద్రాచలం గోదా వరి 111 బిందెల గంగజాలం, తమిళనాడు పూల దండ, కాంచీపురం పట్టువస్త్రాలు, 1400 వడ మాల, 111 కొబ్బరిబోండలతో అభిషేకాలు వైభ వంగా జరుగుతాయని మద్దిమడుగు పీఠాధిపతి కేతావత్‌ జయరాం అన్నారు. ఈ కార్యక్రమానికి తమవంతు సహాయ సహకారాలు ఉంటాయ, ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే సూచించారు. మద్దిమడుగులో ఉన్న సమస్య లను పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు.

Updated Date - Oct 26 , 2024 | 11:26 PM