Share News

విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కృషి చేయాలి

ABN , Publish Date - Dec 28 , 2024 | 11:17 PM

ప్రభుత్వ పాఠశాలల్లో కృత్యాధార విధానం ద్వారా ఉపాధ్యాయులంతా తరగతి బోధన చేసి విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కృషి చేయా లని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ.రమేష్‌ కుమార్‌ సూచించారు.

విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కృషి చేయాలి
రాకొండ కేజీబీవీలో విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న డీఈవో

- విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డీఈవో రమేష్‌కుమార్‌

తెలకపల్లి, డిసెంబరు 28 (ఆంఽధ్రజ్యోతి) : ప్రభుత్వ పాఠశాలల్లో కృత్యాధార విధానం ద్వారా ఉపాధ్యాయులంతా తరగతి బోధన చేసి విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కృషి చేయా లని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ.రమేష్‌ కుమార్‌ సూచించారు. శనివారం తెలకపల్లి లోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, రాకొండ కస్తూర్బాగాంధీబాలికల విద్యాలయాన్ని డీఈవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా పరిషత్‌ ఉ న్నత పాఠశాలలో పదవ తరగతి గదిలో ఆంగ్ల మాధ్యమంలో ఉపాధ్యాయురాలి బోధన ప్రక్రి యను విద్యార్థులతో కలిసి కూర్చొని పాఠాలు విన్నారు. కేజీబీవీ విద్యార్థులతో కలిసి మధ్యా హ్న భోజనం చేశారు. ఈ సంద ర్భంగా ఉపాధ్యాయు ల బోధన పద్ధతులను డీఈవో పరిశీలించారు. ప ట్టుదలతో పని చేస్తే పాఠ శాల స్థాయి మరింత ఉన్న తంగా మారుతుందని ఉ పాధ్యాయులకు సూచించా రు. రానున్న పదవ తరగ తి ఫలితాల్లో నాగర్‌కర్నూ ల్‌ జిల్లాను రాష్ట్ర స్థాయిలో ఉ త్తమ స్థానాల్లో మెరుగు పరి చేలా సబ్జెక్టు ఉపాధ్యాయులు కృషి చేయాల న్నారు. తరగతి గదిలో జరిగే బోధన విధానా న్ని విద్యార్థులు చేసే కృత్యాలను తల్లిదండ్రుల కు వాట్సాప్‌ గ్రూపుల ద్వారా పంపించాల న్నారు. రాకొండ కేజీబీవీని సందర్శించి విద్యార్థు లతో డీఈవో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. డీఈవో వెంట జిల్లాకేజీబీవీల పర్యవేక్షణ అధికారి శోభారాణి, తెలకపల్లి ఎంఈవో శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.

Updated Date - Dec 28 , 2024 | 11:17 PM