గ్రామాల అభివృద్ధికి కృషిచేయాలి
ABN , Publish Date - Jan 18 , 2024 | 12:11 AM
: గ్రామాల సమగ్రాభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిఽధుల సమన్వయంతో కృషిచేయాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు.
ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
మాడ్గులపల్లి, జనవరి 17: గ్రామాల సమగ్రాభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిఽధుల సమన్వయంతో కృషిచేయాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ పోకల శ్రీవిద్య అధ్యక్షతన బుధవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అర్హులైన పేదలందరికీ అందేలా అధికారులు కృషి చేయాలన్నారు. గ్రామాల అభివృద్ధిలో అధికారుల పాత్ర కీలకమన్నారు. గ్రామంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా వెంటనే వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. రానున్న వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ సభ్యుడు మోసిన్‌అలీ, జడ్పీటీసీ పుల్లెంల సైదులు, ఎంపీడీవో దండ జితేందర్‌రెడ్డి, తహసీల్దార్ జమీరొద్దిన్, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు మారుతి వెంకట్‌రెడ్డి, సర్పంచులు అలుగుబెల్లి గోవిందరెడ్డి, మంగా యాదయ్య, బోడె మణెమ్మ తదితరులు పాల్గొన్నారు.
తిరుమలగిరి(సాగర్): మండల కేంద్రంలోగల ఎంపీడీవో కార్యాల యంలో బుధవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశం సాదాసీదాగా ముగిసింది. ఎంపీపీ ఆంగోతు భగవాన్‌నాయక్ అధ్యక్షతన జరిగిన సమా వేశంలో వివిధ శాఖల అధికారులు హాజరై నివేదికలు చదివి విన్పించారు. సర్పంచ్‌ల పదవీకాలం ఈనెల చివరన ముగియనుండడంతో సర్పం చ్‌లను ఎంపీపీ భగవాన్‌నాయక్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు పుట్లూరు రాజశేఖర్‌రెడ్డి, ఎంపీడీవో ఖాజా అజ్గర్‌అలీ సన్మానించారు. ఐదేళ్లలో సర్పంచులు గ్రామాల అభివృద్ధికి కృషి చేశారన్నారు. రానున్న రోజుల్లో గ్రామాల్లోని సమస్యల గురించి సర్పంచ్‌లు అధికారులకు తెలియజేస్తూ వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శాగం శ్రవణ్‌కుమార్‌రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యుడు షేక్ రహీం, గడ్డం సాగర్‌రెడ్డి, డీటీ అన్నపూర్ణ, పీఆర్ ఏఈ సైదులు, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈలు ప్రదీప్‌రెడ్డి, ఏవో జానకిరాములు, ఏపీఎం లక్ష్మీనారాయణ, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.