Share News

పార్కుల అభివృద్ధికి కృషి

ABN , Publish Date - Feb 02 , 2024 | 12:26 AM

ప్రజలకు ఆహ్లాదాన్ని కల్పించే విధంగా పట్టణంలోని పార్కుల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు మునిసిపల్‌ చైర్మన అబ్బగోని రమే్‌షగౌడ్‌ అన్నారు.

 పార్కుల అభివృద్ధికి కృషి
కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభిస్తున్న మునిసిపల్‌ చైర్మన అబ్బగోని రమేష్‌గౌడ్‌

పార్కుల అభివృద్ధికి కృషి

మునిసిపల్‌ చైర్మన అబ్బగోని రమే్‌షగౌడ్‌

నల్లగొండ టౌన, జనవరి 1: ప్రజలకు ఆహ్లాదాన్ని కల్పించే విధంగా పట్టణంలోని పార్కుల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు మునిసిపల్‌ చైర్మన అబ్బగోని రమే్‌షగౌడ్‌ అన్నారు. పట్టణంలోని విద్యానగర్‌ అమృతపార్కులో నూ తనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యానగర్‌ పార్కు స్థలం గతంలో అన్యాక్రాంతమయ్యే పరిస్థితుల్లో కాలనీవాసులు ఎం తో పోరాటం చేసి పార్కు స్థలాన్ని కాపాడారని తెలిపారు. ఆ స్థలాన్ని పట్టణ ప్ర గతి నిధులతో పార్కును అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. విద్యానగర్‌ పార్కునే కాకుండా నల్గొండ పట్టణంలోని అన్ని పార్కులను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రె డ్డి సహకారంతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇప్పటికే పట్టణంలోని ప్రధాన రహదారులపై ప్యాచ వర్క్‌ పూర్తి చేశామని, త్వరలోనే నల్లగొండ పట్టణంలో పా నగల్‌ ఫ్లైఓవర్‌ నుంచి డీఈవో కార్యాలయం వరకు మిగిలిపోయిన జాతీయ ర హదారి పనులకు రీటెండర్‌ ఏర్పాటు చేసి పనులను త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. నల్లగొండ పట్టణం మీదుగా వెళ్లే జాతీయ రహదారి నిర్మాణంతో ఆస్తులు కోల్పోతామని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎవరి ఆ స్తులకు నష్టం జరగకుండానే రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మంత్రి స్పష్టమై న హామీ ఇచ్చారని తెలిపారు. మర్రిగూడ బైపాస్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు, డీఈ వో కార్యాలయం నుంచి దుప్పలపల్లి వరకు ఉన్న రోడ్డుపై మిగిలిపోయిన పనుల ను రెండు మూడు రోజుల్లో ప్రారంభించి త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పార్కు డెవల్‌పమెంట్‌ కమిటీ ప్రధాన సలహాదారు డాక్టర్‌ వలిశెట్టి మనోహర్‌, గౌరవాధ్యక్షులు సింగం రామ్మోహన, సోమగాని శంకర్‌గౌడ్‌, అ ధ్యక్షుడు బుట్టెడ్డి వీరారెడ్డి, సభ్యులు పంతులు శ్రీనివాస్‌, కనుకుంట్ల నవీనరెడ్డి, పిన్నపురెడ్డి భూ పాల్‌రెడ్డి, ఇమ్మడి ఉదయ్‌కుమార్‌, మహేందర్‌రెడ్డి, చక్రపాణి, పద్మావతి, నరసింహారెడ్డి, వెంకటేశ్వర్లు, వీణ సత్యపాల్‌రెడ్డి, వెంకటరమణ, శంక ర్‌గౌడ్‌, వేణుగోపాలరావు, రాములు, వీరారెడ్డి, సుంకరి మల్లే్‌షగౌడ్‌, సతీష్‌ కు మార్‌, డాక్టర్‌ అనంతరెడ్డి, డాక్టర్‌ కస్తూరిచందు, డాక్టర్‌ నరహరి, డాక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి, మోహనరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 02 , 2024 | 12:26 AM