కల్లేపల్లి బంగారు మైసమ్మ ఆలయ అభివృద్ధికి కృషి : ఎంపీ
ABN , Publish Date - Nov 05 , 2024 | 12:41 AM
కల్లేపల్లిలో కొలువైన బంగారు మైసమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యే బ త్తుల లక్ష్మారెడ్డి అన్నారు.
కల్లేపల్లి బంగారు మైసమ్మ ఆలయ అభివృద్ధికి కృషి : ఎంపీ
దామరచర్ల, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): కల్లేపల్లిలో కొలువైన బంగారు మైసమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యే బ త్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని కల్లేపల్లిలో ని ఆలయ ప్రాంగణంలో సోమవారం నూతన పాలకమండలి ప్రమాణస్వీకార కార్యక్రమానికి వారు హాజరై మాట్లాడారు. కల్లేపల్లి బంగారు మైసమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భక్తులు తరలివచ్చి మొ క్కులు చెల్లించుకుంటున్నారని అన్నారు. ఆలయాన్ని దేవాదాయశాఖ సహకారంతో మరింత అభివృద్ధి చేపట్టనున్నట్లు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో కల్యాణ మండపం, వసతిగృహాల ఏర్పాటుతో పాటు మరిన్ని మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని హా మీ ఇచ్చారు. అనంతరం దేవాలయ చై ర్మనగా ఽధీరావత దస్రునాయక్, పాలకవర్గ సభ్యులుగా జాను, అమృ, చినసైదు లు, లక్ష్మమ్మ, భోజ్యా, మంగ్యా, మం గ్తా, సుధాకర్, బాలు, బహుదూర్, కిషన, సైదానాయక్‌లతో పాటు ఎక్స్‌అఫిషియో సభ్యునిగా మాలు నాయక్ బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షు డు కేతావత శంకర్‌నాయక్, నాయకులు ఽధీరావత స్కైలాబ్‌నాయక్, పొదిల శ్రీనివాస్, రామలింగ య్య, మాజీ సర్పంచ జనార్ధన, లింగానాయక్, నెహ్రూ, పాచునాయక్, ఆలయ ఈవో కొండల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.