గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి కృషి
ABN , Publish Date - Jan 27 , 2024 | 01:18 AM
గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి ప్రభు త్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే నేనావత బాలునాయక్ అన్నారు.
గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి కృషి
ఎమ్మెల్యే బాలునాయక్
కొండమల్లేపల్లి, జనవరి 26: గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి ప్రభు త్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే నేనావత బాలునాయక్ అన్నారు. కొండమల్లేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో రూ.1.23 కోట్ల వ్యయంతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. గాజీనగర్‌లో రూ.20లక్షలతో పల్లె దవాఖానా భవన నిర్మాణం, మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా రూ.8.30లక్షలతో మౌలిక సదుపాయాల కల్ప న, కొండమల్లేపల్లిలో రూ.5లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు, బైపాస్ రో డ్డు వద్ద గల ఈద్గాకు రూ.15 లక్షలతో ప్రహరి నిర్మాణానికి శంకుస్థాపన చే శారు. చింతకుంట్ల గ్రామంలో రూ.20 లక్షలతో పల్లె దవాఖానా భవన నిర్మా ణం, కొర్రోనితండాలో రూ.20లక్షలతో నూతన గ్రామపంచాయతీ భవన ని ర్మాణం, గుర్రపుతండాలో రూ.58లక్షలతో బస్‌షెడ్ నిర్మాణం, చెన్నారం గ్రా మంలో రూ.20 లక్షలతో పల్లె దవాఖానా భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన దూదిపాల వేణుధర్‌రెడ్డి, ఎం పీపీ దూదిపాల రేఖరెడ్డి, ఎంఏ. సిరాజ్‌ఖాన, ఎంపీటీసీలు రమావత రాణిరాజునాయక్, జగననాయక్, లక్కీదాస్, సర్పంచ రమావత రవినాయక్, పంది రి రుద్రమ్మశ్రీనివాస్, ఉప సర్పంచులు గంధం సురేష్, యేకుల సురేష్, ఎం పీడీవో బాలరాజురెడ్డి, ఏఈ ధర్మేంద్ర, ఆర్‌ఐ శ్రీనివా్‌సరెడ్డి, నాయకులు ఉ ట్కూరి వేమనరెడ్డి, పెద్దిశెట్టి సుధాకర్, ముత్యాలు, జగదీష్ పాల్గొన్నారు.