Share News

బంజారా భవనానికి స్థలం ఇప్పించేందుకు కృషి

ABN , Publish Date - Mar 01 , 2024 | 12:14 AM

జిల్లా కేంద్రంలో బంజారా భవనానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో మాట్లాడి స్థలం ఇ ప్పించేందుకు తన వంతుగా కృషి చేస్తానని నల్లగొండ మునిసిపల్‌ చైర్మన బుర్రి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

 బంజారా భవనానికి స్థలం ఇప్పించేందుకు కృషి
సభలో ప్రసంగిస్తున్న మునిసిపల్‌ చైర్మన బుర్రి శ్రీనివాస్‌రెడ్డి

బంజారా భవనానికి స్థలం ఇప్పించేందుకు కృషి

మునిసిపల్‌ చైర్మన బుర్రి శ్రీనివాస్‌రెడ్డి

నల్లగొండటౌన, ఫిబ్రవరి 29: జిల్లా కేంద్రంలో బంజారా భవనానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో మాట్లాడి స్థలం ఇ ప్పించేందుకు తన వంతుగా కృషి చేస్తానని నల్లగొండ మునిసిపల్‌ చైర్మన బుర్రి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని క్లాక్‌టవర్‌ సెంటర్‌లో గురువారం నిర్వహించిన సంతుసేవాలాల్‌ జయం తి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సంత సేవాలా ల్‌ మహారాజ్‌ కేవలం గిరిజనుల ఆరాధ్యదైవం మాత్రమే కాదని, అందరికీ ఆరాధ్యుడేనని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గం లో నేటి యువత పయనించాలని అన్నారు. ఏఎస్పీ రాములునాయక్‌ మాట్లాడుతూ బంజారాజాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చా టేలా అహింసా సిద్ధాంతానికి పునాదులు వేశారని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ మన సంస్కృతీ సంప్రదాయాలు కాపాడుకోవాలని సూచించారు. మునిసిపల్‌ వైస్‌చైర్మన అబ్బగోని రమేష్‌గౌడ్‌ మా ట్లాడుతూ ప్రజల అభివృద్ధికి, సంస్కృతీసంప్రదాయాలకు సీఎం రేవంతరెడ్డి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో ట్రైకా ర్‌ మాజీ చైర్మన ఇస్లావత రామచంద్రనాయక్‌, నాయకులు ఆం గోత భగవాననాయక్‌, జిల్లా అధ్యక్షుడు ఆంగోత ప్రవీణ్‌నాయక్‌, ఆర్‌.శంకర్‌నాయక్‌, ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జగనసింగ్‌, కార్యదర్శి రవినాయక్‌, కౌన్సిలర్‌ ప్రదీ్‌పనాయక్‌, నాగార్జుననాయక్‌, నగేష్‌, నరసింహనాయక్‌, బిక్కునాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 12:14 AM