Share News

ప్రతీ పాఠశాలలో విద్యా ప్రణాళికలు అమలు కావాలి

ABN , Publish Date - Jan 03 , 2024 | 11:04 PM

ద్యా ప్ర ణాళికలు అమలు కావాలని కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ విద్యాశాఖ అధి కారులను ఆదేశించారు.

  ప్రతీ పాఠశాలలో విద్యా ప్రణాళికలు అమలు కావాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ నందలాల్‌ పవార్‌

- కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌

వనపర్తి రాజీవ్‌చౌరస్తా, జనవరి 3: ప్రతీ పాఠశాలలో కచ్చితంగా విద్యా ప్ర ణాళికలు అమలు కావాలని కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ విద్యాశాఖ అధి కారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ ప్రజావాణి హాల్‌లో జిల్లా, మం డల విద్యా అధికారులు, కాంప్లెక్స్‌ హెడ్‌ మాస్టర్లు, గెజిటెడ్‌ హెడ్మాస్టర్‌లతో కలె క్టర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉన్నతి, లక్ష్య, ఉ పాధ్యాయులు, విద్యార్థుల హాజరు శాతం, లైబ్రరీ పుస్తకాల సద్వినియోగం, వి ద్యాశాఖ ప్రణాళికలను అమలు చేయడంలో విఫలమౌతున్న పాఠశాలలపై స మీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5వ తరగతి వరకు విద్యా ర్థులకు కనీస అభ్యసన సామర్థ్యాలు , 6 నుంచి 9వ తరగతి విద్యార్థుల కు ఉన్నతి, 10వ తర గతి విద్యార్థులకు లక్ష్య కార్యక్రమం అన్ని పాఠశాలల్లో పక డ్బందీగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మండల విద్యాభి వృద్ధి అధికారులు, కాంప్లెక్స్‌ హెడ్మాస్టర్లు నిరంతరం తమ పరిధిలోని పాఠశాల లను పర్యవేక్షించాలని సూచించారు. ఎక్కడ ఆలసత్వం జరుగుతుందో గుర్తించి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు అంకితభావంతో పని చేయాల ని లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. గత మూడు నెలల్లో 50 శాతం కన్నా తక్కువ హాజరు శాతం ఉన్న విద్యార్థుల వివరాలు సేకరించి నివే దిక ఇవ్వాల్సిందిగా సూచించారు. గైర్హాజరు అవుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు, ఊరి పెద్దలతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సరాసరి హాజరు శాతం 85 శాతం పైన ఉండాలని సూచించారు. త్వరలోనే 2,3 మండలాల ఉపాధ్యాయులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ప్రతీ పాఠశాలలో టీచింగ్‌ ప్లాన్‌ ఉండాలని దానిని అమలు చేయాలని ఆయన సూచించారు. 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు, ప్రేరణ తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ (లోకల్‌ బాడీ) సంచిత్‌ గంగ్వార్‌, డీఈవో కార్యాలయ అధికారులు, ఎంఈవోలు, క్లస్టర్‌ హెడ్మాస్టర్లు, గెజిటెడ్‌ హెడ్మాస్టర్లు పాల్గొన్నారు.

Updated Date - Jan 03 , 2024 | 11:04 PM