Share News

ప్రపంచ సమస్యగా మాదకద్రవ్యాల వాడకం

ABN , Publish Date - Apr 04 , 2024 | 05:04 AM

మాదకద్రవ్యాల వినియోగం, వ్యసనం ప్రపంచ సమస్యగా మారిందని డీజీపీ రవిగుప్తా అన్నారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్‌ బ్యూరో(టీఎస్‌ న్యాబ్‌) ఆధ్వర్యంలో పోలీస్‌, ఎక్సైజ్‌, రైల్వే అధికారులు,

ప్రపంచ సమస్యగా మాదకద్రవ్యాల వాడకం

ఎన్డీపీఎస్‌ కేసుల్లో శిక్షల శాతం పెరగాలి: డీజీపీ రవిగుప్తా

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): మాదకద్రవ్యాల వినియోగం, వ్యసనం ప్రపంచ సమస్యగా మారిందని డీజీపీ రవిగుప్తా అన్నారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్‌ బ్యూరో(టీఎస్‌ న్యాబ్‌) ఆధ్వర్యంలో పోలీస్‌, ఎక్సైజ్‌, రైల్వే అధికారులు, అడిషనల్‌, అసిస్టెంట్‌ పీపీలకు బంజారాహిల్స్‌ కమాండ్‌ కంట్రోల్‌లో ఐదు రోజుల ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని డీజీపీ రవిగుప్తా బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో మాదకద్రవ్యాల కట్టడికి పోలీస్‌ శాఖ అవసరమైన అన్ని చర్యలు చేపట్టిందని తెలిపారు. ఎక్కడికక్కడ కేసులు నమోదు చేసి నిందితులను అరెస్టు చేస్తున్నామన్నారు. ఎన్డీపీఎస్‌ కేసుల్లో శిక్షల శాతం తక్కువగా ఉందని, న్యాయస్థానంలో నిందితులకు కఠిన శిక్షపడేలా దర్యాప్తుపై దృష్టి సారించాలని ఆయా విభాగాల అధికారులకు డీజీపీ రవిగుప్తా సూచించారు.

Updated Date - Apr 04 , 2024 | 08:32 AM